అటవీ అధికారులపై దాడిచేసిన వారిపై కేసు నమోదు*
*14 రోజుల రిమాండ్ కు తరలింపు*
అటవీ అధికారులపై దాడులు చేసిన పలువురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై అరుణ్ తెలిపారు. ఎస్సై అరుణ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 18 తేదిన లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో ట్రాక్టర్ తో చదును చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న అటవీ అధికారులు పనిని నిలిపేందుకు వెళ్లగా అటవీ అధికారులపై దాడులు చేసారని తెలిపారు. అటవీ అధికారులు రాజేందర్ మరియు త్రివేణుల పిర్యాదు మేరకు చెన్నూరి వెంకటస్వామి, ఆసంపల్లి రమేష్, పెరక సతీష్, పెరిక బక్కయ్య, చెన్నూరి ఎర్రయ్య, పడాల రవి అనే ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి, ట్రాక్టర్ సీజ్ చేసినట్లు ఎస్సై అరుణ్ తెలిపారు. అదేవిధంగా 14 రోజుల రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ అధికారులపై దాడులు చేసినా, పనికి అడ్డు వచ్చినా చట్టరిత్యా చర్యలు తీసుకోబడునని తెలిపారు.