అట్టడుగు వర్గాలకు దిక్సూచిగా రాజ్యాంగం

రాజ్యాంగ దినోత్సవంలో చీఫ్‌ జస్టిస్‌ గొగోయ్‌

న్యూఢిల్లీ,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): గత ఏడు దశాబ్దాలుగా భారతీయ రాజ్యాంగం మరింత బలపడిందని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు దాన్ని అందరూ విమర్శించారని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ అన్నారు. ఢిల్లీలోని విజ్‌క్షాన్‌ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దాని పట్ల గర్వంగా ఉందన్నారు. పేద, అట్టడుగు ప్రజలకు మన రాజ్యాంగం ఓ దిక్సూచిగా నిలుస్తుందన్నారు. సంక్షోభ సమయంలో రాజ్యాంగ సూత్రాలు అనేక దారులను కల్పిస్తున్నాయన్నారు. రాజ్యాంగానికి లోబడే కార్యక్రమాలు నిర్వహించడం ఉత్తమమని చీప్‌ జస్టిస్‌ అన్నారు. సాధారణ భారతీయుడికి రాజ్యాంగమే సిక్‌స్త్‌ సెన్స్‌ అని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. కులం, మతం, వర్గం, ఆర్థిక స్థితి ఏదైనా.. రాజ్యాంగ పాలనే భేషన్నారు. శక్తివంతమైన నేతలను, పార్టీలను కూడా దించేయగల సత్తా మన రాజ్యాంగానికి ఉందన్నారు.