అట్టాలతో బొబ్బ తెగులుకు నివారణ

అట్టాలతో బొబ్బ తెగులుకు నివారణ

చండ్రుగొండ అక్టోబర్ 05: (జనంసాక్షి )మిర్చి తోటలకు సోకిన బొబ్బ తెగులు కు తెల్ల దోమ కారణమని భద్రాద్రి జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం కో- ఆర్డినేటర్ నారాయణమ్మ స్పష్టం చేశారు. మండలంలోని గానుగపాడు గ్రామంలో బొబ్బ తెగులు సోకిన మిర్చి తోటలను శాస్త్రవేత్తల బృందంతో కలిసి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… బొబ్బ తెగులు కు కారణమైన తెల్ల దోమ ను రైతులంతా సామూహికంగా నివారించుకోవాలని, తెలుపు, పసుపు, నీలం రంగు అట్టాలను ఎకరానికి 50 చొప్పున ఏర్పాటు చేసుకోవాలన్నారు. రసం పీల్చే పురుగుల నివారణకు కొట్టాల్సిన క్రిమిసంహారక మందుల వివరాలను రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు శివ,నవీన్ కుమార్, వ్యవసాయాధికారి వినయ్, ఏఈఓ శ్రీనివాసరావు రైతులు పాల్గొన్నారు.