అణచబడ్డ కులాలు ఏకం కావాలి

– ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి గుగ్గిళ్ల పేరయ్య
డోర్నకల్ సెప్టెంబర్ 14 జనం సాక్షి
స్వతంత్రం సిద్ధించే 75 ఏళ్లు అవుతున్న ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీ,మహిళల మీద హత్యలు,అత్యాచారాలు,కుల బహిష్కరణలు నేటికీ జరుగుతున్నాయని ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి గుగ్గిళ్ల పేరయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం మున్సిపల్ కేంద్రంలోని రైల్వే అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈనెల 29న విశాఖపట్నంలో జరగబోయే మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ సమావేశంన్ని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు,మేధావులు, మాదిగ,మాదిగకులాల ఉద్యమకారులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.కులం పునాదుల మీద ఒక జాతిని కాని ఒక నీతిని కానీ నిర్మించలేంమని,మహాజన రాజ్యాని స్థాపించుకుని ఎవరి దెగ్గర అయితే అత్యధిక ఖనిజ సంపద,ఉన్నదో ఎవరి చేతుల్లో ఆర్థిక మెజారిటీ ఉన్నదో అంత సమానంగా పంచాలని,ఆనాడు అంబేద్కర్ అన్నారని ఆయన తెలిపారు తెలంగాణ ప్రజాధనం కోటానుకోట్లు దుర్వినియోగం అవుతున్నాయని అందుకే పాలక వర్గాలకు బుద్ధి చెప్పే విధంగా అన్ని రాజకీయ పార్టీలను బహిష్కరించి మహాజన రాజ్యాన్ని స్థాపించుకునే విధంగా మంద కృష్ణ మాదిగ,పేదలకు ఆపద్బాంధవుడు ల నిరంతరం కృషి చేస్తూ పేదల కోసం మహాజనా సోషలిస్టు పార్టీ నిర్మాణం చేశారన్నారు. ఈ సమావేశంలో కొత్తపల్లి వెంకన్న, కొప్పుల రాజుకుమార్, కత్తుల బాలరాజు,చింతల వెంకట్, బోనగిరి బిక్షపతి,కుమార్, లక్ష్మణ్, దుర్గయ్య, రఘు, రాంబాబు తదితరులు ఉన్నారు.
Attachments area