‘అణు’బంధం

పలు కీలక ఒప్పందాల దిశగా భారత్‌`జపాన్‌
జపాన్‌ రాజుతో మన్మోహన్‌ భేటీ
భారత్‌లో పర్యటించాలని ఆహ్వానం
టోక్యో, (జనంసాక్షి) :
భారత్‌`జపాన్‌ మధ్య ‘అణు’బంధం బలపడే దిశగా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. జపాన్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ బుధవారం ఆదేశ ప్రధాని సింజో అబేతో భేటీ అయ్యారు. పరస్పర అణు సహకారం అందించుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. భారత్‌కు న్యూక్లియ్‌ రియాక్టర్లు ఎగుమతి చేసేందుకు జపాన్‌ అంగీకరించింది. చర్చల అనంతరం మన్మోహన్‌, అబే ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పౌర రక్షణ చర్యలతో కూడిన అణు సంబంధం పెంపొందించుకోవాలని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. ప్రపంచంలో జపాన్‌కు మాత్రమే అణుదాడులు ఎదుర్కొన్న అనుభవం ఉంది. ఈనేపథ్యంలో పౌర అణుసంబంధాలపై ఇరు దేశాలు పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయించాయి. ఈ సందర్భంగా     మన్మోహన్‌సింగ్‌ మాట్లాడుతూ, ప్ర పంచ వ్యాప్తంగా అణుసంబంధ సవాళ్లు, భారత్‌`జపాన్‌ మైత్రి, శాంతి యుత వాతావరణంలో అణుసహ కారం, భవిష్యత్‌లో అసియా`పసిఫిక్‌, భారత సముద్రతీర ప్రాంతంలో సహకారం దిశగా చర్యలు తీసుకుంటు న్నట్లు చెప్పారు. చైనా, దక్షిణ చైనా, ఉత్తర చైనాతో స్నేహ బంధాన్ని కోరుకుంటు న్నట్లు తెలిపారు. ఎన్‌పీటీ, సీటీబీటీ ఒప్పందాల మేరకు జపాన్‌తో చర్చలు జరిపినట్లు తెలిపారు. అనంతరం మన్మోహన్‌సింగ్‌ జపాన్‌ రాజు అఖితోతో భేటీ అయ్యారు. భారత్‌లో పర్యటించాలని ఆయనను ఆహ్వానించారు. మన్మోహన్‌ ఆహ్వానా నికి స్పందించిన అఖితో త్వరలోనే భారత్‌కు వస్తానని, అక్కడి సంప్రదా యాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు.