అతిపెద్ద బుద్ద విగ్రహం ఆవిష్కరణ

పాట్నా,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌.. 70 అడుగుల ఎత్తు ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. నలంద జిల్లాలోని రాజ్‌గిర్‌లో దీన్ని ప్రారంభించారు. దేశంలో ఇది రెండవ అతిపెద్ద బుద్ధుడి విగ్రహం. మహాబోది ఆలయ ప్రధాన పూజారి భంటే చాలిండా సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఘోరా కటోరా సరస్సులో సుమారు 16 విూటర్ల వెడల్పుతో ఉన్న గద్దెపై బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 45 వేల క్యూబిక్‌ ఫీట్ల పింక్‌ శ్యాండ్‌తో విగ్రహాన్ని తయారు చేశారు. ప్రత్యేక బోట్‌లో బుద్దుడి విగ్రహం చుట్టు సీఎం నితీశ్‌ ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహించారు. అయిదు కొండల నడుమ ఉన్న సరస్సులో బుద్దుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, ఇది ప్రజలను విశేషంగా ఆకర్షిస్తుందని సీఎం నితీశ్‌ తెలిపారు.