అత్యాచారకేసులో ప్రాసిక్యూటర్‌గా దయాన్‌కృష్ణన్
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో సామూహిక అత్యాచారానిగురై మరణించిన యువతి కేసులో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా న్యాయవాది దయాన్ కృష్ణన్‌ను నియమించారు. ఈకేసులో స్వచ్ఛందంగా వాదించేందుకు ఆయన ముందుకు వచ్చారు. ఆయనతో పాటు మరో ఇద్దరు సహాయకులుంటారని ఢిల్లీ ప్రత్యేక పోలీసు అధికారి ధర్మేంద్రకుమార్ తెలియజేశారు.