అద్దంకిని డివిజన్‌ చేయాలి

ఒంగోలో,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): ఒంగోలు నగర పరిధిలోని చెరువుకొమ్ముపాలెం గ్రామ సవిూపంలోని నల్లవాగు ఆక్రమణలను ఇటీవల పరిశీలించారు. ఒంగోలుకు చెందిన రియల్టర్లు నల్లవాగును ఆక్రమించి ఇళ్ల ప్లాట్లు వేశారంటూ స్థానికులు గతంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఇదిలావుంటే చారిత్రక ప్రాధాన్యం కలిగిన అద్దంకిని రెవెన్యూ డివిజన్‌ చేయాలని అద్దంకి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు అన్నారు. ఈ మేరకు లక్ష సంతకాల సేకరణ సేకరించి ముఖ్యమంత్రికి, ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు చెప్పారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురైన అద్దంకిని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెడ్డి రాజుల రాజధానిగా పేరొందిన అద్దంకిని రెవెన్యూ డివిజన్‌గా చేసేందుకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయన్నారు. అలాగే పట్టణంలో నిర్మాణంలో ఉన్న నామ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై ఏర్పడిన వేగనిరోధకాలు ఎత్తు పెంచి వాహన చోదకులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, రహదారి విస్తరణా గుత్తేదారు ఇష్టారీతిన చేపట్టి గృహస్థులకు ఇబ్బంది కలిగిస్తున్నారన్నారు. రెవెన్యూ డివిజన్‌గా చేయాలని కోరుతూ లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు తెలిపారు.