అధికారంలోకి మళ్లీ మేమే వస్తామని చెప్పుకునే మంత్రి కేటిఆర్ ఆశాలకు హామీ ఎందుకు ఇవ్వలేదు

అధికారంలోకి మళ్లీ మేమే వస్తామని చెప్పుకునే మంత్రి కేటిఆర్ ఆశాలకు హామీ ఎందుకు ఇవ్వలేదు

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 29 జనం సాక్షి.
జోగులాంబ గద్వాల జిల్లా
గద్వాల పట్టణంలోని సృతివనం దగ్గర ఉప్పేరు, అర్బన్, ప్రాథమిక ఆరోగ్య కార్యకర్తల అధ్వర్యంలో చేపట్టిన 6వ రోజు నిరవధిక సమ్మెలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జెడ్పి చైర్ పర్సన్ సరిత మద్దతు తెలిపారు. ఆశా కార్యకర్తలతో మట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం సమ్మెను ఉద్దేశించి జెడ్పి చైర్ పర్సన్ సరిత మాట్లాడుతూ ఆశాలకు ఎగ్జామ్ ను వెంటనే రద్దు చేయాలని, పెరుగుతున్న ధరలకనుగుణంగా ఆశాలకు ఇస్తున్న పారితోషికాలను రూ.18.000/- లకు పెంచి, ఫిక్సిడ్ వేతనం ఇవ్వాలని న్యాయమైన డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లాలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆశా కార్యకర్తల డిమాండ్ ను పట్టించుకోకుండా పోవడం ఏమిటాన్ని,మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమాగ మట్లాడే కేటిఆర్ ఆశాలకు ఎందుకు హామీ ఇవ్వలేదని, మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకం లేక హామీ ఇవ్వలేదని సరిత అన్నారు.వెంటనే బిఆర్ఎస్ ప్రభుత్వం ఆశా కార్యకర్తల డిమాండ్లను పరిశీలించి పరిష్కరించాలని లేనిపక్షంలో ఆశా కార్యకర్తలకు మద్దతుగా ఎంత దూరమైన ఉద్యమిస్తామని కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో సునీత,పద్మ, నాగ ప్రమీల, జయలక్ష్మి, శ్వేత, శ్రీదేవి,కవిత,అబేద,నర్సింగమ్మ,వరలక్ష్మి, లక్ష్మి,సుగుణమ్మ, సరోజ ,చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.