అధికారుల గైర్హాజరు పట్ల ఎంపీపీ ఆగ్రహం
– మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా – మంథని ఎంపీపీ కొండ శంకర్
జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తనని మంథని ఎంపీపీ కొండ శంకర్ అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మంథని ఎంపీపీ కొండ శంకర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ కొండ శంకర్ మాట్లాడుతూ… మంథని మండల అభివృద్ధికి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ నేతృత్వంలో అహర్నిశలు కృషి చేస్తానని, అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో అధికారుల గైర్హాజరు పట్ల ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయ పరుచుకుని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ పాలకులని, ప్రజాసేవ లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు ముందుకెళ్లాలని, అధికారులు ప్రజల పట్ల బాధ్యతగా ప్రవర్తించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పిటిసి తగరం సుమలత శంకర్ లాల్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కొమ్మిడి స్వరూప్ రెడ్డి, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు పెగడ శ్రీనివాస్, ఎంపీటీసీలు మిర్యాల ప్రసాద్ రావు, పెండ్లి చైతన్య ప్రభాకర్ రెడ్డి, గుమ్మడి సత్యవతి రాజయ్య, ఊదరి లక్ష్మీ లచ్చన్న, చెరుకు తోట ఓదెలు, బడికెల దేవక లింగయ్య, ఎంపీడీవో రమేష్, మండల ప్రజా పరిషత్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు