అనుమతులు లేకుండా బాణాసంచా నిల్వచేయరాదు
కాకినాడ ,అక్టోబర్29(జనంసాక్షి): దీపావళి పండుగ నేపథ్యంలో అనుమతులు లేకుండా బాణసంచా తయారు చేసీనా, నివాస ప్రాంతాలలో నిల్వ ఉంచినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. బాణసంచా వినియోగించే ముడి పదార్థాలను ఇంటి అవరణలో ఉంచరాదని తెలిపారు. అనుమతులు లేకుండా దీపావళి మందుగుండు సామాన్లు అమ్మరాదని ఆయన అన్నారు. ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. దీపావళి పండుగ సవిూపిస్తున్న తరుణంలో మండలంలో ఎక్కడైనా అనుమతులు లేకుండా బాణసంచా, పేలుడు పదార్థాలను అక్రమంగా నిల్వ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనావాసాల మధ్య అక్రమ నిల్వలు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అక్రమ బాణసంచా నిల్వలపై నిరంతరం నిఘా నిర్వహించనున్నట్లు తెలిపారు. నిల్వ చేసినా, బాణసంచా తయారు చేసినా చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. బాణసంచా విక్రయాలకు విధిగా అనుమతులు తీసుకోవాలన్నారు