అన్ని తానై….

తల్లిదండ్రు లేని అనాధ జంటకు వివాహం..
పెళ్లి పెద్దగా అన్ని తానయి నిర్వహించిన వ్యాపారవేత్త, టిఆర్ ఎస్ నాయకులు భూసాని శ్రీనివాస్..
ఫోటో: వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తున్న జడ్పీ చైర్మన్, సర్పంచులు, ఎంపీటీసీ తదితరులు..
సిద్దిపేట అర్బన్, ఆగస్టు 13(జనం సాక్షి): అబ్బాయికి తల్లి తండ్రి ఎవరూ లేరు .. కనీసం బంధువులు కూడా లేరు.. అమ్మాయికి తల్లి మాత్రమే ఉండి కనీస బంధువులు కూడా లేరు. అటువంటి ఇద్దరినీ చేరదీసి అన్ని తానే అయి సొంత ఇంటి వివాహంలాగా శనివారం సిద్దిపేటలో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరిపించి వధూవరులను ఇద్దరినీ ఒకటి చేశారు ప్రముఖ వ్యాపారవేత్త టిఆర్ఎస్ నాయకులు భూసాని శ్రీనివాస్ దంపతులు. అబ్బాయి 10 ఏళ్ల క్రితం మహారాష్ట్ర నుంచి అనాధగా వచ్చి శ్రీనివాస్ వద్ద ఉద్యోగంలో చేరాడు. తాను తల్లిదండ్రులు ఎవరు తన సొంత ఊరు ఏదో ఇప్పటివరకు అబ్బాయికి తెలియదు. అమ్మాయిది దుబ్బాక మండలం చికోడు గ్రామం తనకు కూడా తల్లి మాత్రమే ఉండి నా అనే వారు ఎవరూ లేరు. అటువంటి ఇద్దరినీ చేరదీసి తన సొంత ఖర్చులతో అన్ని తానే వివాహాన్ని జరిపించి ప్రస్తుతానికి వారికి తన సొంత స్థలంలోనే ఉండడానికి తాత్కాలికంగా ఇంటిని ఏర్పాటు చేశారు శ్రీనివాస్. ఈ వివాహానికి జడ్పీ చైర్మన్ రోజా శర్మ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాధాకృష్ణశర్మ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శ్రీనివాస్ ను అభినందించారు. స్వార్థ ప్రపంచంలో ఇంత గొప్పగా ఆలోచించి అనాధ జంటకు వివాహం జరిపించి ఒకటి చేసిన శ్రీనివాస్ దంపతులను పలువురు ప్రజాప్రతినిధులు కూడా అభినందించారు.పొన్నాల గ్రామ సర్పంచ్ రేణుక శ్రీనివాస్, ఎంపీటీసీ మమతా యాదగిరి,కిష్ట సాగర్ సర్పంచ్ భూసాని రాజయ్య, పిఎసిఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, టిఆర్ఎస్ అర్బన్ శాఖ అధ్యక్షులు యాదగిరి, తదితరులు వివాహానికి హాజరయ్యారు.