అప్జల్ గురు క్షమాబిక్ష దరఖాస్తును తిరస్కరించండి
-ప్రణబ్‌ను కోరిన బాల్ థాకరే
ముంబాయి: పార్లమెంట్‌పై దాడి కేసులో మరణశిక్ష పడిన అప్జల్‌గురు క్షమాబిక్ష పిటిషన్‌ను నిర్వ్దందంగా తిరస్కరించాలని.. కొత్త రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్ ముఖర్జీని శివసేన డిమాండ్ చేసింది. ఈ చర్యతోనే ప్రణబ్ రాష్ట్రపతిగా తన విధులను ప్రారంభించి చరిత్ర సృష్టించాలని ఆ పార్టీ అధినేత బాల్ థాకరే అభిలషించారు. దేశ సార్వభౌమత్యంపైనే దాడి చేసిన ఉగ్రవాదిని ఉరితీయాల్సిందేనని అన్నారు. అలాంటివారు బతికి ఉండరాదని చెప్పారు. ఈ పవిత్ర విధిని మీరే నిర్వహించాలంటూ ప్రణబ్‌ను ఉద్దేశించి అన్నారు. పార్టీ పత్రిక సామ్నాలో ఈ మేరకు పేర్కొన్నారు. స్వాతంత్య్రసమరంలో లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్‌ల సేవలను గుర్తుచేస్తూ..ఇప్పుడు లాల్ పాత్రను ప్రణబ్ ముఖర్జీ పోషించాలన్నారు.