అప్పుల కుప్పగా మారిన ఎపి
ఎక్కడా అప్పుపుట్టని స్థితలోకి రాష్ట్రంనిమ్మకాయల చినరాజప్ప విమర్శలు
అమరావతి,అక్టోబర్11 (జనం సాక్షి)
సీఎం జగన్ ఏపీని అప్పులపాలు చేసి అభివృద్ధిని విస్మరించారని మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. అప్పుల కుప్పగా ఎపి మారిందన్నారు. దీనికితోడు విద్యుత్ సంక్షోభం రాబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ రోడ్ల నిర్మాణం సహా అభివృద్ధిపనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకురాని దుస్థితి ఏర్పడిరదని తెలిపారు. గత ప్రభుత్వంలో పనులుచేసిన వారికి బిల్లులు ఇవ్వలేదని చెప్పారు. కవిూషన్లు ఇస్తేనే ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేస్తోందని ఆరోపించారు. నరేగా నిధులకోసం కాంట్రాక్టర్లు కోర్టులకు వెళ్లాల్సిన దౌర్భాగ్యాన్ని ముఖ్యమంత్రి కల్పించాడని విమర్శించారు. రాష్టాన్రికి ఎక్కడా అప్పులుకూడా పుట్టని దుర్గతి జగన్‌రెడ్డి కల్పించారని ఆరోపించారు. సీఎం వైఖరి మారకపోతే రాష్ట్ర పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుందని నిమ్మకాయల చినరాజప్ప ఆందోళన వ్యక్తం చేశారు.