అఫ్జల్ ఖాన్ కు శుభాకాంక్ష లు తెలిపిన సమాచార కమీషనర్ మహ్మద్ అమీర్

:శామీర్ పేట్, జనం సాక్షి :
శామీర్ పేట లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్, మరియు ఆయన సోదరుడు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్ ల గృహ ప్రవేశ వేడుకలో తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మహ్మద్ అమీర్ పాల్గొని ఇరువురి కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహ్మద్ అమీర్ మాట్లాడుతు.. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న అఫ్జల్ ఖాన్ కు పార్టీ నాయకత్వం గుర్తింస్తుదని ,త్వరలో మంచి నామినేటేడ్ పదవి రావచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్, మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, మహ్మద్ అమీర్ లతో పాటు టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, మహ్మద్ ఇస్మాయిల్ ఖాన్, వంగ నర్సింహ రెడ్డి, నజామ్, అయూబ్ షరీఫ్, వెంకటేష్ గౌడ్,కలీం, లయ్యిఖ్ తదితరులు పాల్గొన్నారు.
13ఎస్పీటీ -1: సమాచార కమీషనర్ అమీర్ ను సన్మానిస్తున్న దృశ్యం