అభివృద్దికి అడ్డుపడడం తగదు

పవన్‌, జగన్‌లకు టిడిపి హితవు
అనంతపురం,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): అభివృద్ధి అజెండాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ అన్నారు. అయితే అభివృద్ది జరగలదేన్న రీతిలో పవన్‌ కళ్యాణ్‌, జగన్‌లు ప్రచారం చేయడం తగదన్నారు.  నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి బాధ్యతను గుర్తించి సిఎంచంద్రబాబు కృషి చేస్తుంటే విపక్షనేత జగన్‌తో పాటు వైకాపా నేతలు అడ్డుపుల్లలు వేస్తూ అడ్డుపడుతున్నారని  అన్నారు. కోట్లు అవినీతి చేసి జైల్లో ఉండి వచ్చిన నాయకులు చంద్రబాబును విమర్శించడం బాధాకరమన్నారు. ప్రాజెక్టుల్లో జలకళ చూసి జగన్‌ ఓర్వలేక పోతున్నారని ఆక్షేపించారు. వైఎస్‌ జగన్‌ తీరుపై ఆయన  ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ అక్రమంగా నీరు వాడుకుంటోందన్న తెలంగాణ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యల్లో నిజంలేదని  అన్నారు. కృష్ణా బోర్డుకు అధికారులు వాస్తవాలు వివరించారని తెలిపారు. గోదావరి నుంచి సముద్రంలోకి 2160 టీఎంసీల నీరు వెళ్లిందన్నారు. ఇదిలావుంటే అధికారులను సంప్రదించి రైతులు సాగు చేసిన పంటల వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు చేయించుకోవాలనిఅధికారులు అన్నారు. వ్యవసాయ అధికారులు రైతు ఫోటోను తీసుకొని సర్వే నంబరు వారీగా వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచాలని సూచించారు. ప్రతికూల పరిస్థితుల్లో పంట నష్టపోయినా ‘ఈ-వ్యవసాయం’ గణాంకాల మేరకు పరిహారం అందుతుందన్నారు. వెబ్‌సైట్‌లో ఉన్న రైతుల వివరాల ఆధారంగా ప్రభుత్వ పథకాలను అందజేస్తారన్నారు. రైతుల పంటల సాగు వివరాలు అంతర్జాలం సహాయంతో ‘ఈ-వ్యవసాయం’ వెబ్‌సైట్‌లో పొందు పరుస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానానికి పెద్ద పీట వేస్తుందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో రైతులు సాగు చేసిన పంటలు, విస్తీర్ణం తదితర వివరాలను బహుళార్థక విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు పొందుపరుస్తారన్నారు.

తాజావార్తలు