అభివృద్దిలో ముందున్న హైదరాబాద్
జలమండలి భద్రతా పక్షోత్సవాల్లో మంత్రి తలసాని
హైదరాబాద్,ఆగస్ట్21(జనంసాక్షి): హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయని అన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఐటి, పరిశ్రమల విస్తరణతో ప్రపంచ నగరంగా పోటీపడుతోందన్నారు.
వెస్ట్ మారేడుపల్లిలో జలమండలి భద్రతా పక్షోత్సవాలకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీతోపాటు 190 గ్రామాలకు జలమండలి సేవలు అందుతున్నాయని చెప్పారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆధునిక టెక్నాలజీతో మ్యాన్ హళళ్లలో పూడిక తొలగింపు జరుగుతున్నదని తెలిపారు. 2014కు ముందు తాగునీటి కోసం హైదరాబాద్‌లో నిత్యం ఆందోళనలు జరిగేవని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని చెప్పారు. అప్పటి జనాభాకు అనుగుణంగా ఏర్పాటు చేసిన డ్రైనేజి, త్రాగునీటి వ్యవస్థ కారణంగానే కొన్ని ఇబ్బందులు ఎదురైనట్లు వెల్లడిరచారు. ప్రస్తుతం పెరిగిన జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరా, డ్రైనేజి వ్యవస్థ అభివృద్ధి జరుగుతుందని మంత్రి అన్నారు.