అభివృద్ది ఆగిపోకుండా టిఆర్‌ఎస్‌నే ఆశీర్వదించండి

కాంగ్రెస్‌-టిడిపిల పొత్తులను నమ్మొద్దు: ముత్తిరెడ్డి

జనగామ,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): జనగామ ప్రాంతంలో చెరువులు నింపి రైతులకు ఆర్ధిక భరోసా కల్పించి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పయనింప జేసిన ఘనత సిఎం కెసిఆర్‌దని మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్‌డ్డి అన్నారు. తనను దీవించి ఎమ్మెల్యేగా గెలిపించాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి పట్టం గట్టడం వల్ల నియోజవకర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునే వీలుంటుందన్నారు. జనగామ పట్టణ సుందరీకరణ, జంక్షన్‌ అభివృద్ధి వంటి పనులకు ఇటీవల రూ.30 కోట్లు విడుదలయ్యాయని, సూర్యాపేట-సిద్ధిపేట జాతీయ రహదారి, జనగామకు ఔటర్‌రింగ్‌రోడ్డు త్వరలో మంజూరు కానున్నాయన్నారు. చెరువులు నింపుతూ రైతుల కోసం కష్టపడిన ముత్తిరెడ్డిని ప్రజలు మరోసారి ఆశీర్వాదించాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ప్రగతి బాటలు వేసిన నాయకుడిని మరచిపోవద్దని కోరారు. రాష్ట్రంలో టీడీపీ-కాంగ్రెస్‌ పార్టీలు అనైతిక పొత్తుకు తెరతీస్తుండటం దురదృష్టకరమని, వీరికి ఓటువేస్తే అభివృద్ది ఆగిపోగలదని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఆస్తులు, మళ్లీ పెత్తనం కోసం కుటిలపొత్తులకు నాంది పలుకుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌-టీడీపీ కలిస్తే మళ్లీ వలస పాలన తప్పదన్న సంగతి ప్రజలు గమనించాలన్నారు. సీఎం కేసీఆర్‌ అదేశాలమెరకు ఈనెల 25లోపు యువ ఒటర్లను నమోదుచేయించాలని కోరారు. అదేవిధంగా ఓటర్లజాబితాలో తప్పు ఒప్పులను సరిదిద్దాలని దీనిలో గ్రామాల్లోని నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. అదేవిధంగా బూత్‌లెవల్‌లో ఐదుగురుని నియమించుకోవాలని సూచించారు. పదవీకాలంలో చేసిన పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాలే మళ్లి గెలిపిస్తాయని ఎవరూ అధైర్యపడొద్దని చెప్పారు. పార్టీలో స్వార్థం లేకుండా పనిచేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనించాలని సూచించారు. అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే ప్రత్యర్థులు ఇబ్బందులకు గురి చేసే అవకాశాలున్నాయన్నారు.