అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి : ఎంపిపి దూదిపాల రేఖ రెడ్డి

కొండమల్లేపల్లి అక్టోబర్ 4 జనం సాక్షి : అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని కొండమల్లేపల్లి ఎంపిపి దూదిపాల రేఖ రెడ్డి అన్నారు బుధవారం నాడు కొండమల్లేపల్లి ఎంపిడిఓ కార్యాలయంలో జరిగిన మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపిపి దూదిపాల రేఖ రెడ్డి మాట్లాడుతూ మండల పరిధిలోని ఉన్నటువంటి అన్ని గ్రామాలలో సర్పంచులు కార్యదర్శులు అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో అందరూ సమన్వయంతో ముందుకు వెళ్తూ ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు అదేవిధంగా ప్రభుత్వం చేపట్టినటువంటి ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు త్రాగునీటి సమస్య మౌలిక సదుపాయాలు డ్రైనేజ్ నిర్మాణాలు సిసి రోడ్ల నిర్మాణ పనులు పాఠశాలల అదనపు తరగతుల గదుల నిర్మాణాలు వేగవంతం చేయాలని అన్నారు విద్యుత్ అధికారులు గ్రామాలలో ఉన్న కరెంట్ స్తంభాలను ట్రాన్స్ ఫార్మర్ లను ప్రజలకు రైతులకు ఇబ్బందులు కలపకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు వ్యవసాయ అధికారులు గ్రామాలలో రైతులకు అందుబాటులో ఉండాలని తెలిపారు అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామాలలో మిషన్ భగీరథ నీళ్ల సమస్య రాకుండా సమన్వయం చేసుకోవాలన్నారు మండలంలో ఉన్న అన్ని శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వారి వారి శాఖలకు కేటాయించిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు అంగన్వాడి సూపర్వైజర్ తిప్పర్తి రాధా అంగన్వాడీలు ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మె డిమాండ్లను నెరవేర్చాలని జనరల్ బాడీ దృష్టికి తీసుకెళ్లారు అనంతరం ఎంపిపి దూదిపాల రేఖ రెడ్డి స్పందిస్తూ అంగన్వాడీ ఆశావర్కర్ల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ బాలరాజు రెడ్డి వైస్ ఎంపిపి కాసర్ల వెంకటేశ్వర్లు సిరాజ్ ఖాన్ సీనియర్ అసిస్టెంట్ వినోద్ వివిధ గ్రామాల ఎంపిటిసిలు సర్పంచులు గ్రామ పంచాయతీ కార్యదర్శులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు