అమ్మ నాన్న లేని చిన్నారులకు చేయూతనందించిన మంజులరెడ్డి

హుస్నాబాద్ రూరల్ జూలై 05(జనంసాక్షి) పట్టణంలోని ఆరెపల్లి వార్డ్ కు చెందిన చిన్నారులు కత్తుల మహేష్, రమేష్ వీరి తల్లిదండ్రులు కీ శే కత్తుల లచ్చవ్వ, కీ శే వెంకటయ్య పిల్లలు చిన్నతనంలోనే ఉండగా చనిపోవడంతో, చిన్నారుల ఇద్దరు ఎవరు లేని వారు అయ్యారు వారి కున్న స్థలంలో పునాదులు, గోడలు నిర్మాణం వరుకు ఉన్న ఇంటిని పూర్తి అవ్వడానికి సహాయం కోసం చిన్నారులు సోషల్ మీడియా ద్వారా వేడుకున్న వార్తను చూసి చలించిపోయి , యువసేన సభ్యులు ద్వారా పరిస్థితిని తెలుసుకున్న సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి తక్షణమే స్పందించి, మంగళ వారం రోజు ఉదయం చిన్నారుల ఇంటికి వెళ్లి, పరిశీలించి ఇంటి పై కప్పు నిర్మాణానికి సంబందించిన రేకులను ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంజులరెడ్డి మాట్లాడుతూ చిన్నారులకు ఎప్పుడు అండగా ఉంటానని, బాగా చదువుకోవాలని సూచించారు. తమ వంతుగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. మంచి పనికి అందరు ఒక్కటై సహాయం అందచేస్తున్న హుస్నాబాద్,ఆరెపల్లి కాలనీ వాసులకి, సోషల్ మీడియా లో చూసి సహాయం అందచేస్తున్న ప్రతిఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలియచేశారు..స్పందించి వచ్చి సహాయం చేసిన మంజులరెడ్డి యువత, కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియచేశారు..ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వార్డ్ కౌన్సిలర్ మ్యాదరబోయిన శ్రీనివాస్,కాశవేన సాంబరాజు ,కాశవేన రమేష్ , కోతర బోయిన పరశురాములు బాలయ్య ,దేవేందర్ మహేష్ సిద్దు కాలనీ వాసులు, మంజులక్క యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు