అరకొర వసతులతో కొట్టుమిట్టాడుతున్న సంక్షేమ హాస్టల్స్

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 29(జనం సాక్షి)
 అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు పల్లె మురళి,గడ్డం నాగార్జున ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ప్రారంభమైన మోటార్ సైకిల్ యాత్ర కామారెడ్డి,నిజామాబాద్,నిర్మల్,ఆదిలాబాద్,కొమురంభీం. మంచిర్యాల పెద్దపల్లి ములుగు  జిల్లాల మీదుగా 5వ రోజు800 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న  భాగంగా  వరంగల్ పట్టణానికి చేరుకున్న సందర్భంగా విద్యార్థి ప్రజా సంఘ నాయకులు పూలమాలతో స్వాగతం పలికారు
ఈ సందర్భంగాఓంకార్ భవన్ అండర్ బ్రిడ్జి వద్ద విలేకరుల సమావేశం రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్  మాస్ సావిత్రి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది
 ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పల్లె మురళి గడ్డం నాగార్జున మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులపై సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని,సరైన సౌకర్యాలు కల్పించడం లేదని,ప్రజాప్రతినిధుల జీతాలు పెంచుతున్నారే తప్ప విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచడం లేదని,కరెంట్,వాటర్ సమస్యలు,పక్క భవనాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని,పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారని,వెంటనే విద్యారంగ సమస్యల్ని పరిష్కరించకపోతే ,రాష్ట్ర వ్యాప్తంగా  ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగుతాం అన్నారు. విద్యారంగ సమస్యల సాధనకై పెద్దఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలనే విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు ఈ యాత్ర 30 వ తేదీన రంగా రెడ్డి జిల్లాలో ముగింపు అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎఐఫ్ డి ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండారు చిరంజీవి జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల సాయి కుమార్ జిల్లా నాయకులు గడ్డం రాజు, సాయి  అరుణ్,రాజశేఖర్, బిఎల్ఎఫ్ నాయకులు ఐతమ్ నగేష్ ,రమేష్,తదితరులు పాల్గొన్నారు