అరబిందో కార్మికుల న్యాయదీక్ష

శ్రీకాకుళం,అక్టోబర్‌15(జ‌నంసాక్షి): పైడి భీమవరం అరబిందో కార్మికుల డిమాండ్స్‌ పరిష్కరించాలని కోరుతూ.. సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో న్యాయదీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష సిఐటియూ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు పూల మాల వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ.. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలన్నారు. అక్రమంగా నిలుపుదల చేసిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కార్మికుల సమస్యలన్నిటినీ పరిష్కరించాలంటు డిమాండ్‌ చేశారు.

తాజావార్తలు