అర్హులైన అందరికీ ఆసరా పెన్షన్ అందుతుంది

పెద్దవంగర, సెప్టెంబర్ 03(జనం సాక్షి )
మండలంలోని గత రెండు రోజులుగా వివిధ గ్రామాలలో కొత్తగా మంజూరైన పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు అందించారు, అదేవిధంగా మండలంలోని మిగతా గ్రామాలైన పెద్దవంగర, చిన్నవంగర, చిట్యాల, బావోజితండా, బీసి తండా, ఎల్బి తండా, గ్రామాలలో మంజూరైన లబ్ధిదారులకు ఆయా గ్రామాలలో శనివారం రోజున స్థానిక సర్పంచుల అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ ఈదురు రాజేశ్వరి,జెడ్పిటిసి శ్రీరామ్ జ్యోతిర్మయి పాల్గొని పెన్షన్ పత్రాలను మరియు ఐడి కార్డులను పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ఎంపీపీ జడ్పిటిసి మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు సహాయా సహకారాలతో మన మండలంలోని దాదాపు అన్ని గ్రామాలలో ఎక్కువ మందికి లబ్ధి చేకూరిందని దీని వలన ప్రతి ఒక్కరూ కేసిఆర్ దయాకర్ రావు లకు రుణపడి ఉంటామని తెలియజేశారు, మండలం మొత్తంలో 20 గ్రామపంచాయతీలకు గాను1082 కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని, అత్యధికంగా పెద్దవంగరలో 173 మంది లబ్ధిదారులకు మంజూరు కాగా, అత్యల్పంగా బావోజితండా లో 11 మందికి మంజూరయ్యాయని, 65 ఏళ్ల నుండి 57 ఏళ్లకే వయసును కుదించి, దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనంతగా దాదాపు 85 లక్షల మందికి ఆసరా పెన్షన్ ద్వారా లబ్ధిని చేకూర్చే ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని అన్నారు,
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, సర్పంచులు రావుల శ్రీనివాస్ రెడ్డి, జలగం లక్ష్మి, ధారావత్ పద్మ, జాటోత్ తార, పెద్దవంగర ఉప సర్పంచ్ శ్రీరామ్ రాము ఎంపీటీసీ సభ్యులు ఎదునూరి శ్రీనివాస్, మెట్టు సౌజన్య, ఏపిఎం నరేంద్ర కుమార్, పాలకుర్తి దేవస్థాన కమిటీ చైర్మన్ రామచంద్ర శర్మ, తెరాస మండల పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ కేతిరెడ్డి సోమనరసింహారెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్, రైతు కోఆర్డినేటర్ పాకనాటి ఉపేందర్ రెడ్డి, పాక్స్ డైరెక్టర్ అన్నపురం రవి, నాయకులు శ్రీరాం సుధీర్, బోనగిరి లింగమూర్తి, జలగం శేఖర్, చిలుక బిక్షపతి, ఇన్చార్జి ఎంపిఓ జగదీష్, పంచాయతీ కార్యదర్శులు,వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.