అలుపెరుగని పోరాట వీరుడు
హైదరాబాద్ జనం సాక్షి
తొలిదశ ఉద్యమకారుడు స్వతంత్ర సమరయోధుడు. కి.శే. మన్నెబొయిన నర్సింహ యాదవ్ గారి 46వ వర్ధంతి సందర్భంగా ఉద్యమాంజలి ఘటించిన ఆడిక్ మెట్ రంనాగర్ పరిసర ప్రాంతాల ప్రజలు.
తెలంగాణ స్వాతంత్ర తొలిదశ సమరయోధులు, కీర్తిశేషులు మన్నెబోయిన నర్సింలు యాదవ్ గారి (ఉష్కే) 46వ వర్ధంతి కార్యక్రమాన్ని మన్నెబోయిన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు 01.10.2021 ఉదయం పది గంటలకు అడిక్ మేట్ నందుగల వారి పాత స్వగృహ కూడలిలో జరుపబడినది.
బిక్కి, బీద, అసంఘటిత కార్మికుల కొరకును, తెలంగాణ జాతి విముక్తి కోరకు నిర్విరామ పోరాటమును మన్నబోయిన నర్సింలు యాదవ్ చేశారు. అప్పటి కార్మిక శాఖ మంత్రి , పేద ప్రజల పక్షపాతి టంగుటూరి అంజయ్య, జి.వెంకటస్వామి,యం.ఏ హషిమ్ వంటి కాంగ్రెస్ సోషలిస్టుల సమకాలీనుడుగా కాంగ్రెస్ రాజకీయాలలో పని చేస్తూ కార్మికుల శ్రేయస్సు,బస్తీ వాసుల హక్కుల,సౌకర్యాల కల్పన కోసం శాయశక్తులా కృషి సల్పి, వారితో కూడా కలిసి పనిచేశారు.
అక్టోబర్ 1వ తేదీ1976లో మరణించేవరకు ప్రజా ఉద్యమాలు సంఘీభావంగా ఉంటూ, ప్రజల శ్రేయస్సు పరమావధిగా,సేవా కార్యక్రమాలలో జీవించాడు . తన పిల్లలకు ప్రజాహిత రాజకీయాలపై మమకారం కలిగించే విధంగా తర్ఫీదు ఇచ్చాడు.
స్థానిక అడిక్ మేట్ ప్రాంతమే కాకుండా దేశవిదేశాలలో ఉన్న దాదాపు 200 మంది మన్నెబోయిన వంశపు కుటుంబీకులు మన్నెబోయిన ఫౌండేషన్ ద్వారా కరోనా విపత్కర సమయంలోనే కాకుండా అన్ని సమయాలలో పేదలకు అసంఘటిత కార్మికులకు, స్థానిక మైనారిటీ ప్రజలకు చేదోడు వాదోడుగా తమ సేవలు అందిస్తున్నారు.
ఇట్టి కార్యక్రమంలో కుమారులు గోపాల్ యాదవ్, (ఎంప్లాయిమెంట్ ఆఫీస్ రిటైర్డ్ ఉద్యోగి), విజయకుమార్ యాదవ్(INTUC నాయకులు), వెంకటేష్ యాదవ్ ,(HCL ఉద్యోగి), మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, మరియు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం. బి. కృష్ణయాదవ్ వారి Durga madhavi Yadav Bharithi ashok Yadav vasanth Yadav.Renuk Yadav MVS Niranjan Yadav MB.Bal Subramanya teja Yadav కుటుంబీకులు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా స్థానిక బస్తివాసుల స్థితిగతులపై నిరంతర అన్వేషణ చేస్తున్న మన్నెబొయిన ఫౌండేషన్ వారు సన్మానం చేశారు. స్థానిక నాయకులు , నేత శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ,, టేజేఎస్ సిటీ అధ్యక్షుడు నర్శయ్య, నాయకులు శ్రీనివాస్ యాదవ్ క్రిష్ణ మా చారి రాజు,రాజిరెడ్డి,బాబు,శ్రీనివాస్ యాదవ్,టీ యాదగిరి,రూబీ,బండి రమేష్,సుధాకర్,లక్ష్మణ్,పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, స్థానిక ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.