అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి అల్పాహార కార్యక్రమాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యేమెచ్చా నాగేశ్వరరావు అశ్వారావుపేట బీసీ కాలని లోని ఎంపీపీఎస్ లో విద్యార్థులకు స్వయంగా వడ్డించి ప్రారంభించారు..అనంతరం ఎమ్మెల్యే పిల్లలతో ఆత్మీయంగా మాట్లాడుతూ ఎలా ఉంది అని అడగగా పిల్లలు చాలా బాగుంది సార్ థ్యాంక్యూ సార్ అంటూ సంతోషంగా సమాధానం ఇచ్చారు.అలాగే గర్ల్స్ హై స్కూల్ లో విద్యార్థినులకు మొత్తం 61సైకిల్ లు రాగ ఈరోజు 16సైకిల్లను వారికి అందజేశారు ఎమ్మెల్యే మిగిలిన సైకిల్లు రెండు రోజుల్లో వస్తాయని వారికి తెలిపారు.అనంతరం అదే పాఠశాలలో మొత్తం చెత్త పేరుకుపోయి ఉండడం గమనించిన ఎమ్మెల్యే గారు వెంటనే శుభ్రం చేయాలని హెచ్ఎం ని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఇప్పటికే ఉదయం వేళల్లో రాగిజావను అందిస్తుండగా..మధ్యాహ్న భోజనాన్ని గుడ్డుతో పాటు అందిస్తున్నారు.ఈ రెండింటికి మధ్యలో ఇకపై అల్పాహారంగా కిచిడీ, పొంగల్‌, ఉప్మా వంటి వాటిని విద్యార్థులకు అందించడం చాలా సంతోషంగా ఉందని…ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని అన్ని స్థాయిల విద్యార్థులకు ఈ అల్పాహారాన్ని ఇవ్వనున్నారనీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మాత్రమే తెలంగాణ ప్రజల పై అమితమైన ప్రేమ ఉందని అందుకే అధ్బుతమైన పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. సైకిల్లు అందేసిన వారికి తగు జాగ్రత్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జుజ్జురు వెంకన్న బాబు జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి ,ఎంపీటీసీ లు,మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.