అవిూతువిూకి సిద్దం అంటున్న బిజెపి

బాబు అవినీతి వ్యవహారాలపై కన్నేసిన కమలదళం

అసెంబ్లీ వేదికగా ఆవేశం వెల్లగక్కిన బాబు

అమరావతి,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ విషయంలోనే కాకుండా..చంద్రబాబు విషయంలోనూ బిజెపి ఇక అవిూతువిూకే సిద్దంగా ఉన్నట్లు తాజా ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. బాబు కూడా బిజెపి లక్ష్యంగా ఉద్యమించడం, అసెంబ్లీలో ఎదురుదాడి చేయడం చూస్తుంటే అవిూతువిూకి ఇరు పార్టీలు సిద్దం అయ్యాయి.ఎన్‌డిఎ నుంచి బాబు బయటపడ్డాక బిజెపిపై ఎదురుదాడి మొదలు పెట్టారు. అదేరీతిలో బిజెపి కూడా ఎదురుదాడికి తెగించింది. సోము వీర్రాజు లాంటి వారు గట్టిగానే బాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎన్నికల సమయం ఆసన్నం కావడంతో రాజకీయంగా బిజెపి, టిడిపిల మధ్య మాటల యుద్దం, అవినీతి ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. అసెంబ్లీలో బిజెపి పక్షనేత విష్ణుకుమార్‌ రాజును ఉద్దేశించి చందరబాబు ఆవేశంగా చేసిన విమర్శలు ఇందుకు తార్కాణం. నిత్యం విమర్శల దాడి జరగవచ్చు. ప్రత్యేక¬దా ఉద్యమం ఉవ్వెత్తున రగలడంతో ప్రత్యేక¬దా, ప్యాకేజీల విషయంలో స్పష్టత లేకపోవడం, ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ఎన్‌డిఎ నుండి కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు రావడం తెలుగుదేశం పార్టీకి అనివార్యంగా మారింది. కొద్దిరోజుల కిందటి వరకు ప్రత్యేక ప్యాకేజికి జైకొట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు ప్రత్యేక¬దా ఆంధ్రుల హక్కు అని నినదిస్తున్నారు. ఎన్‌డిఎలో ఉన్నంతకాలం మిత్రధర్మం పేరుతో ప్రశంసలు కురిపించుకున్న బిజెపి, టిడిపి నేతలు ఇప్పుడు పరస్పర ఆరోపణలతో దుమ్మెతిపోసుకుంటున్నారు. ఎపి అభివృద్దికి అనేక విధాలుగా సాయం అందించామని, నిధులు విడుదల చేశామని ఇప్పటికే బిజెపి నాయకులు పదేపదే ఏకరువు పెట్టారు. పనిలో పనిగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అవినీతిని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. అన్నీ సక్రమంగా ఉంటే నిధుల వినియోగ ధృవీకరణ పత్రాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. బిజెపికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అక్రమాలను గతంలోనే బయటపెట్టి, రాష్ట్ర సర్కారును నిలదీసి ఉండాల్సింది. అలా ఎందుకు చేయలేదన్న ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిఉంది. వీటన్నింటికి మించి ఎన్నికలకు ముందు ప్రత్యేక¬దా ఇచ్చి తీరుతామంటూ నమ్మబలికి, ఇప్పుడు మొండిచేయి ఎందుకు చూపిస్తున్నారన్న ప్రశ్నకు కూడా బిజెపి జవాబు చెప్పాలి. చంద్రబాబునాయుడు కూడా రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిఉంది. ఢిల్లీ చుట్టు ఎన్నో ప్రదర్శనలు చేశానంటూ ప్రధానమంత్రి అప్పాయింట్‌మెంట్‌ ఇవ్వలేదంటూ ఇప్పుడు చెబుతున్న మాటలతో ప్రజల సానుభూతికి మూటగట్టుకోవచ్చనుకుంటే పొరపాటే! రాష్ట్రంలోని అఖిలపక్ష పార్టీలతో, కనీసం శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ప్రతిపక్షంతో సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజిని గతంలో అర్ధరాత్రి హడావిడిగా ఎందుకు స్వాగతించారన్న ప్రశ్నకు ఆయన జవాబిచ్చి తీరాలి. శాసనసభలో ముఖ్యమంత్రి చెప్పిన వివరాల ప్రకారమే రాజధానికి ఇచ్చిన నిధుల్లో కొంత మొత్తానికి వినియోగ ధృవీకరణ పత్రాలు సమర్పించలేదన్నది స్పష్టమౌతోంది. అలా ఎందుకు జరిగిందో ఆయన వివరణివ్వాలి. పోలవరంతో పాటు వివిధ ప్రాజెక్టుల్లో చోటుచేసుకుంటున్న అవినీతి పైనా సమగ్రవివరాలను ప్రజల ముందుంచాలి. టిడిపి, బిజెపిలు రాష్ట్ర ప్రజలను మోసం చేయడంలో ఒకదానితో మరొకటి పోటీ పడ్డాయని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎవరి బండారం ఏమిటన్నది ప్రజలు నిర్ణయిస్తారు.