అవిూర్‌పేట – ఎల్బీనగర్‌.. మెట్రో రైలు ప్రారంభం

– జెండాఊపి ప్రారంభించిన గవర్నర్‌ నర్సింహన్‌
– పాల్గొన్న మంత్రులు కేటీఆర్‌, నాయిని, తలసాని,పద్మారావు
– ఎల్బీనగర్‌ వరకు మెట్రోలో ప్రయాణించిన గవర్నర్‌, మంత్రులు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి) : నగర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎల్బీనగర్‌ – అవిూర్‌పేట మెట్రో రైలు మార్గం ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చింది. సోమవారం గవర్నర్‌ నరసింహన్‌, మంత్రి కేటీఆర్‌, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి కలిసి అవిూర్‌పేట – ఎల్బీనగర్‌ మెట్రో రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అవిూర్‌పేట నుంచి ఎల్బీనగర్‌ వరకు గవర్నర్‌ నరసింహన్‌తో పాటు మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పద్మారావు, నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డితో పాటు పలువురు అధికారులు ప్రయాణించారు. మధ్యలో ఎంజీబీఎస్‌ స్టేషన్‌ వద్ద గవర్నర్‌, మంత్రులు కొద్దిసేపు ఆగి.. స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ కు ఎంజీబీఎస్‌ స్టేషన్‌ ప్రత్యేకతను మంత్రి కేటీఆర్‌ వివరించారు. ఎల్బీనగర్‌ నుంచి తిరుగుప్రయాణంలో గవర్నర్‌, కేటీఆర్‌.. ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ లో దిపోయారు.  కాగా ఈ మెట్రో రైలు అవిూర్‌పేట నుంచి పంజాగుట్ట, అసెంబ్లీ, నాంపల్లి, కోఠి, ఎంజీబీఎస్‌, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట విూదుగా ఎల్బీనగర్‌ వరకు మెట్రో పరుగులు పెడుతుంది. ప్రస్తుతం ఈ ప్రధాన మార్గంలో మెట్రో అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎల్బీనగర్‌- అవిూర్‌పేట మెట్రో ప్రత్యేకత ..
హైదరాబాద్‌లో మూడు కారిడార్లలో మొత్తం 72కిలోవిూటర్ల పొడవున మెట్రో సేవలందించాలన్నది లక్ష్యం. ఇప్పటికే నాగోల్‌ నుంచి మియాపూర్‌ దాకా 30కిలోవిూటర్ల మేర మెట్రో అందుబాటులో ఉంది. సోమవారం నుంచి అవిూర్‌పేట- ఎల్బీనగర్‌ కారిడార్‌లో మిగిలిన 16కిలోవిూటర్లు అందుబాటులోకి వచ్చింది. ఈ మార్గంలో మొత్తం 17స్టేషన్లు ఉన్నాయి. ఇప్పటివరకు 29కిలోవిూటర్ల మొదటి కారిడార్‌ మొత్తం (మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు) పూర్తయింది. కారిడార్‌ 1 మిగతా రెండు కారిడార్ల కంటే అతిపెద్దది కావడంతోపాటు మొత్తంగా ఈ మార్గంలో 27 స్టేషన్లు ఉండటం విశేషం. మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ వెళ్లదలుచుకున్నవారు ఇక విూదట ఎక్కడా ఇంటర్‌చేంజ్‌ కానవసరం లేకుండానే గమ్యం చేరుకోవచ్చు. మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ చేరుకోవాలంటే బస్సు లేదా ఇతర వాహనాల ద్వారా కనీసం రెండుగంటలు పడుతుంది. కాని మెట్రో ద్వారా కేవలం 50 నిమిషాల్లో చేరుకునే వీలు కలుగుతుంది. మెట్రో రైలు తొలుత సగటున 32 కి.విూ వేగంతో ప్రయాణించనుంది. మొదట్లో రైలు ఫ్రీక్వెన్సీని ప్రతి 5 నిమిషాలు, తర్వాత 2 నిమిషాలుగా నిర్దేశించారు. అసెంబ్లీ నుంచి ఎంజీబీఎస్‌ స్టేషన్‌ వరకు 5 కి.విూ. మార్గాన్ని దక్కనీ రాతి పూతతోనూ, ఇండో-పర్షియన్‌ కళాత్మక శైలి రైలింగ్‌తోనూ, ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబించే రహదారి ఫర్నిచర్‌తోనూ హెరిటేజ్‌ ప్రిసింక్ట్‌గా మారుస్తున్నారు.
ఢిల్లీ తర్వాత మనదే..
సోమవారం ప్రారంభమైన 16కిలోవిూటర్ల మెట్రోమార్గంతో కలిపి హైదరాబాద్‌ మెట్రో రైలు మార్గం పొడవు 46 కిలోవిూటర్లకు చేరింది. దీంతో దేశంలో ఢిల్లీ మెట్రో తర్వాత ఎక్కువ దూరం మెట్రో రైలు మార్గం ఉన్న నగరంగా హైదరాబాద్‌ గుర్తింపు పొందింది. ఇప్పటివరకు రెండు, మూడు స్థానాల్లో ఉన్న బెంగళూరు (42.3కి.విూ.), చెన్నై (35.3) నగరాల మెట్రోలను మూడు, నాలుగు స్థానాలకు హైదరాబాద్‌ మెట్రో నెట్టేసింది.
ఆసియాలోనే పెద్ద మెట్రో స్టేషన్‌..
ఎల్బీనగర్‌-మియాపూర్‌ మార్గంలో గల ఎంజీబీఎస్‌ స్టేషన్‌.. ఆసియాలోనే అతిపెద్ద మెట్రో స్టేషన్లలో ఒకటి. మియాపూర్‌-ఎల్బీనగర్‌, జేబీఎస్‌-ఫలక్‌నుమా మెట్రో మార్గాలకు ఇది ఇంటర్‌ ఛేంజ్‌ స్టేషన్‌. ఒకటి, రెండు అంతస్తుల్లో ఎల్బీనగర్‌ మెట్రో ఎ/-లాట్‌ఫాం, మూడు, నాలుగు అంతస్తుల్లో జేబీఎస్‌కు ఎ/-లాట్‌పామ్‌లు ఉంటాయి. 58 స్తంభాలు, 6 గ్రిడ్స్‌తో అత్యంత ఎత్తుగా ఈ స్టేషన్‌ నిర్మించారు. 140 విూటర్ల పొడవు, 45 విూటర్ల వెడల్పుతో స్టేషన్‌ ఉంటుంది. ఎంజీబీఎస్‌ స్టేషన్‌ వైపు ‘ఎ’ మార్గం, చాదర్‌ఘాట్‌ వైపు ‘బి’ మార్గం కోసం పొడవైన ఆకాశ మార్గాలను నిర్మించారు.