అవ్వకు ఆసరా పింఛన్ భరోసా.
– పెన్షన్ల పంపిణీలో తెలంగాణే అగ్రగామి. -అర్హులందరికీ పింఛను అందిస్తాం.
-డా.రసమయి బాలకిషన్.
బెజ్జంకి,ఆగస్టు30,(జనం సాక్షి):మండల కేంద్రము లో మార్కెట్ యార్డ్ లో సోమవారం రోజున నూతనంగా మంజూరు అయిన ఆసరా పెన్షలను రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.రసమయి మాట్లాడుతూ మానకొండూర్ నియోజకవర్గంలోని 6మండలాలలో ప్రతి నెల 105కోట్ల పించన్లు పంఫణి చేస్తున్నామని,పేదలు ఆత్మగౌరవంతో బతుకాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని,లబ్ధిదారులకు 1,070 కొత్త పింఛన్ కార్డులు పంఫణి చేసి,పేదింటి మహిళలు ఆర్థిక పురోగతి సాధించడానికి బ్యాంకు లింకేజీ రుణాలు అందించారు.మహిళ సంఘాలకు 2 కోట్ల 13 లక్షల 50 వేల రూపాయల బ్యాంక్ లింకేజి రుణాలు పంపిణి చేసినారు.అనంతరం బెజ్జంకి శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవాలయంలో కోటి రూపాయల తో అదనపు పనుల నిర్మాణానికి భూమిపూజ చేసి,మండల కేంద్రములోని 61 లక్షల రూపాయలతో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి భూమిపూజ చేసినారు.రసమయి తన మాటా ఆటా పాటలతో అందరిని అలరించినారు,సాంస్కృతిక కళాకారులు పాడిన పాటలకు కంట తడిపెట్టిన మహిళలు
ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ 57 సంవత్సరాలు నిండిన పేదలందరికి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తుందన్నారు.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ దక్కిందన్నారు.పింఛన్ల మంజూరు నిరంతర పక్రియ అని,ఇంకా ఉన్న అర్హులకు కూడా త్వరలోనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని అన్నారు.ఇచ్చిన మాటకు కట్టుబడి వృద్ధులు,దివ్యాంగులు,ఒంటరి మహిళలు,వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.అదేవిధంగా డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని,ప్రభుత్వం అందించిన ఈ రుణాలు బాగా పని చేస్తున్న సంఘాలకు స్వయంగా అందిస్తున్నాం అని అన్నారు.సంఘాలు సంయుక్తంగా కలిసి వ్యాపారాలు పెట్టుకొని స్వయం ఉత్పత్తి కింద అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగపడుతాయి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల,డిఎల్పిఓ రాజ్ కుమార్,మండల కో ఆప్షన్ సభ్యులు,తెరాస మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి,ఏఎంసీ చైర్మన్ కచ్చు రాజయ్య,స్థానిక సర్పంచ్ ద్యావనపల్లి మంజుల శ్రీనివాస్,ఎంపిడివో దమ్మని రాము,తెరాస రాష్ట్ర నాయకులు చింతకింది శ్రీనివాస్ గుప్తా,అన్నీ గ్రామల సర్పంచ్లు,ఎంపీటీసీలు,అధికారులు పాల్గొన్నారు.