అసమానతలు లేని సమాజం కోసం కృషి చేయాలి

• తహశీల్దార్ బాలరాజు…
దౌల్తాబాద్, ఆగస్టు 30, జనం సాక్షి.
పౌర హక్కుల దినోత్సవన్ని పురస్కరించుకొని దొమ్మాట గ్రామంలో గ్రామ సర్పంచ్ పూజిత వెంకట్ రెడ్డి అధ్యక్షతన అవగాహన సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశానికి దౌల్తాబాద్ మండల ఎమ్మార్వో బాలరాజ్ ముఖ్య అతిథులుగా హాజరై సమావేశాన్ని ఉద్దేశించి సమాజంలో నివసిస్తున్న ప్రజలందరూ సమానమని కులమత బేధాలు అసమానతలు లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలన్నారు.కులం పేరుతో దూషించిన అవహేళన చేసి మాట్లాడిన ఎస్సీ,ఎస్టీల పైన ఇతర కులాలు అనవసరంగా దాడికి దిగిన వారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని తెలియజేశారు.ఈ దేశంలో అందరూ సమానంగా జీవించేటి హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని, భారత రాజ్యాంగం ప్రకారం పౌరుడు ప్రాథమిక హక్కులు ఉన్నాయన్నారు.అలాగే గ్రామంలో ఎస్సీ,ఎస్టీలను కులం పేరుతో దూషించిన దాడులు చేస్తే భాదితులు నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాధు చేయాలని తక్షణమే నింధితులపై చట్టప్రకారం చర్యలు తీసుకొని శిక్షించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మధు,ఉప సర్పంచ్ సింహాచలం, వార్డు సభ్యులు కనకయ్య, షబ్బీర్, నరసింహులు,ఎల్లయ్య,గ్రామ పోలీసు అధికారులు శివకుమార్,నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.