ఆకివీడు చేరుకున్న రైతుల పాదయాత్ర
ఏలూరు,అక్టోబర్19(జనంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జమూరు వద్ద శుక్రవారం కౌలు రైతుల సంఘ పాదయాత్రకు ఆకివీడు మండల నాయకులు స్వాగతం పలికారు. ఈ నెల 10న కాకినాడ నుండి పాదయాత్రగా బయలుదేరిన కౌలు రైతుల సంఘ పాదయాత్ర శుక్రవారం ఆకివీడు మండలానికి చేరింది. 4 జిల్లాల్లోని 200 గ్రామాల గుండా ఈ పాదయాత్ర కొనసాగి ఈ నెల 31 నాటికి గుంటూరులో అడుగిడనుంది. శుక్రవారం అజ్జమూరు రైతులు కౌలు రైతులను సాదరంగా ఆహ్వానించారు. ఆకివీడు మండలం చెరుకుమిల్లిలో రైతులు, కౌలు రైతుల పాదయాత్ర బృందంతో చర్చించారు. కౌలు రైతుల రక్షణ సంక్షేమానికై ఈ పాదయాత్ర కొనసాగుతోంది.