ఆక్వా ప్రాజెక్టుతోనే మత్స్యకారులకు మేలు

ఏలూరు,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  మెగా ఆక్వా ప్రాజెక్టు వల్ల మత్స్యకారులకు మేలు జరుగుతుందని అధికార  పార్టీ నేతలు ప్రచారం ఉధృతం చేస్తున్నారు. కాలుష్యం ఉంటే తరలించే ఏర్పాట్లు చేస్తామని సిఎం చంద్రబాబు ఇచ్చిన హావిూని గుర్తు చేస్తున్నారు. పరిశ్రమ ప్రభావిత గ్రామాల్లో ఏడాదికి మౌలిక వసతులకు రూ.25 లక్షలు కేటాయిస్తామన్నారన్నారు. పరిశ్రమలను వ్యతిరేకిస్తే నరసాపురం నియోజకవర్గ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోతుందని మత్స్య సహకార సంఘ నాయకులు పేర్కొంటున్నారు.  జిల్లాలో ఆక్వా రంగంపైనే రూ.3 వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. తుందుర్రులో మెగా ఆక్వాఫుడ్‌ పార్కు నిర్మాణం జరగాలన్నారు. పరిశ్రమలో కాలుష్య ప్రభావం ఉండదని, పరిశ్రమ నుంచి వెలువడే నీటిని పైపులైను ఏర్పాటు చేసి సముద్రానికి తరలించడానికి రూ.25 కోట్లతో ప్రతిపాదనలు చేశారన్నారు. గతంలో ఎంపీ కృష్ణంరాజు పేరుపాలెంలో రిఫనరీ తీసుకొస్తే వ్యతిరేకించడంతో వేరే ప్రాంతానికి తరలిపోయిందన్నారు. అది నిర్మాణం జరిగి ఉంటే మత్స్యకారుల అభివృద్ధి చెందేవారన్నారు.  మత్స్యకారులకు ఇబ్బంది కలగకుండా తుందుర్రు మెగా ఆక్వాఫుడ్‌ పార్కుకు పైపులైను నిర్మిస్తామని యాజమాన్యం మంత్రి కొల్లు రవీంద్రకు తెలిపారన్నారు. 5 వేల మంది మత్స్యకారులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు.

తాజావార్తలు