ఆగని ఆన్‌లైన్ టిక్కెట్ల రచ్చ
పవన్ తీరును మరోమారు విమర్శించిన పోసాని
హైదరాబాద్,సెప్టెంబర్28(జనంసాక్షి): ఏపీలో ఆన్ లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకాల వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. వైసీపీ వర్సెస్ జనసేనగా మారింది. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్‌లో ఏపీ ప్రభుత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. పవన్‌కు కౌంటర్‌గా వైసీపీ మంత్రులు ఘాటుగానే విమర్శలు చేశారు. మరోవైపు సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కూడా ఇప్పటికే పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి ప్రెస్ విూట్ పెట్టి పవన్‌పై విమర్శలు చేశారు. సోమవారం రాత్రి నుంచి ఇప్పటి వరకు తనకు ఫోన్లు వస్తూనే ఉన్నాయన్నారు. జగన్‌ను పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. చిరంజీవిని కేశినేని నాని విమర్శించారని గుర్తు చేశారు. కేశినేని నాని వద్దకు వెళ్లి నిలదీశానని, దానితో నాని ఇంటికి వెళ్లిపోయారని పోసాని పేర్కొన్నారు. ’ ఫ్యాన్స్‌తో గ్రూపును పెట్టుకున్నాడు. ఫంక్షన్లకు తన ఫాన్స్‌ను పంపిస్తున్నాడు. నువ్వు సద్దాం హుస్సేన్ లా నియంతవా. పవన్ కల్యాణ్ ఒక సైకో. నా భార్యపై ఆరోణలు చేసి నైతికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. విష్ణుబాబు నామినేషన్ వేయడానికి వస్తే అక్కడా పవన్ బ్యాచ్ ఉంది. పవన్ కల్యాణ్ నేను డీమోరలైజ్ కాను. పవన్ కల్యాణ్ రోజూ నన్ను తిట్టు.. నేనిలానే బతుకుతా.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టైమ్ లో నాకు, పవన్ మధ్య
విభేదాలు వచ్చాయి. షూటింగ్ సమయంలో పవన్ నన్ను ఇబ్బందులు పెట్టారు. షూటింగ్‌లో సమయ పాలన పాటించని పవన్ కల్యాణ్. పవన్‌ను కేసీఆర్ బహిరంగంగా హెచ్చరించారు. అప్పుడు పవన్ అభిమానులు ఎందుకు ఊరుకున్నారు. జగన్‌పై విమర్శలు చేయడంతోనే నేను రియాక్ అయ్యాను.’ అని పోసాని తెలిపారు.