ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జెండాల పంపిణి
చౌడాపూర్, ఆగస్టు 11( జనం సాక్షి ): భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహానీయుల త్యాగాలను గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆజాది కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమంలో భాగంగా జెండాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ప్రతి భారతీయ పౌరులు తమ ఇంటి దగ్గర మూడు రోజుల పాటు హర్ ఘర్ తిరంగ్ అభియాన్ నిర్వహించి ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించడం జరిగింది. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు బందయ్య,ప్రధాన కార్యదర్శి రాజశేఖర్,జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి శ్రీనివాసులు, వెంకటేశం,శరత్,భారత్,జనార్ధన్, సునీల్,శ్రీనివాసులు,హనుమంత్, రమేష్,వెంకటేష్,శివప్రసాద్ తదితరులు పాల్గొనడం జరిగింది.