ఆడపిల్లంటే ఇంటి మహాలక్ష్మి
అక్టోబర్ 11..అంతర్జాతీయ బాలికా దినోత్సవం..
విజయవాడ,అక్టోబర్11 ( జనం సాక్షి ), : ఆడపిల్ల నట్టింట్లో తిరుగుతుంటే.. ఆ ఇంట్లో మహాలక్ష్మీ ఉన్నట్టే ఉంటుంది. ఆడపిల్ల నవ్వు ఓ పువ్వులా ఇంటికి అందాన్నిస్తుంది. అమ్మాయి అనురాగం పంచుతుంటే.. ఆప్యాయంగా నాన్నా అని పిలుస్తుంటే.. అంతకు మించిన ఆనందం ఏముంటుంది..? బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలియజేసేందుకే అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పౌరహక్కులు అనగానే గుర్తుకువచ్చే తొలిపేరు ఎలానార్ రూజ్‌వెల్ట్. 192 దేశాలు సంతకం చేసిన మానవ హక్కుల ప్రకటనలో స్త్రీ, పురుష సమానత్వాన్ని ప్రతిబింబించేలా కీలక మార్పులు చేశారు. అందులో మ్యాన్ అన్న మాటను పీపుల్‌గా ఆమె మార్చారు. నీ అనుమతి లేకుండా ఎవరూ నిన్ను తక్కువగా చూడలేరు. అంటూ మహిళలు తమ ఆత్మగౌరవాన్ని తామే నిలబెట్టుకోవాలని, అందుకు ఎంతటి పోరాటమైనా చేయాలని సూచించారు. అందుకే ఆమె పుట్టిన రోజును అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది.ఆడుతూ పాడుతూ తల్లిదండ్రుల చాటున గడపాల్సిన పదకొండేళ్ల వయసులో సమైరా మెహతా కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో పలువురికి శిక్షణనిస్తోంది. అమెరికాకు చెందిన ఈ బాలిక` తన ఈడు పిల్లలు ఆడుకునేందుకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కృత్రిమ మేధ కాన్సెప్ట్‌లను నేర్పించే గేమ్‌ను ఆవిష్కరించింది. ’కోడర్‌బన్నిజ్’ అనే కంపెనీని స్థాపించి, దానికి సీఈఓగా మారింది. కేవలం ఏడాదిలోనే 35 వేల అమెరికన్ డాలర్లు సంపాదించి, సిలికాన్ వ్యాలీ దృష్టిని ఆకట్టుకుంది. లింగ సమానత్వంకోసం పాటుపడే ఈ తరం ఆడపిల్లలంతా సంఘటితమైతే సాధించలేని అద్భుతమేవిూ ఉండబోదని ఈ చిన్నారి అంటోంది.