ఆదివారం పోలీసుల చర్య సరైనదే :షిండే
న్యూఢిల్లీ: ఆదివారం అల్లర్లపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పందించారు. ఆందోళనకారులపై పోలీసుల చర్యను హోంమంత్రి ఈసందర్భంగా సమర్థించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌పై విచారణ తర్వతే చర్యలు తీసుకుంటామని షిండే తెలిపారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయలేమని ఆయన పేర్కొన్నారు. నేరాలపై చట్ట సవరణకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని షిండే తెలిపారు.