ఆదివాసీల హక్కులు కాపాడాలి
ఆదిలాబాద్,నవంబర్21 (జనం సాక్షి) : లంబాడాల కారణంగా ఆదివాసీల హక్కులకు భంగం వాటిల్లుతోందని తుడుందెబ్బ నేతలు అన్నారు.లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తుడుందెబ్బ, ఆదివాసీ ఉపాధ్యాయ సమాఖ్య, ఆదివాసీ విద్యార్థి సంఘాల రాష్ట్ర, జిల్లాస్థాయి నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. తరతరాలకుగా ఆదివాసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల్లో మరింత చైతన్యం రావాలన్నారు. లంబాడీలతో తమ రిజర్వేషన్లకు ప్రమాదం ఏర్పడిదన్నారు. మారుమూలన జీవించే ఆదివాసీలకు ఇప్పటికీ అత్యధిక శాతం ఇళ్లు లేవన్నారు. అలాంటప్పుడు కరెంట్‌లో రాయితీలు ఎవరికి ప్రయోజనం కల్గిస్తాయో అర్థం చేసుకోవాలని తెలిపారు.