ఆనాడే ఎన్టీఆర్ క్షోభ అనుభవించారు
పొత్తులతో ఇప్పుడు కొత్తగా ఆత్మ క్షోభ ఎక్కడిది?
కాంగ్రెస్,టిడిపిల కలయికపై విమర్శలు అర్థరహితం
హైదరాబాద్,సెప్టెంబర్18(జనంసాక్షి): తెలంగాణలో కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ జట్టు కట్టడం సాధ్యం కాదనుకున్న వారు ఇప్పుడు కొత్త రకం వాదన తెరపైకి తెస్తున్నారు. ప్రధానంగా బిజెపి, టిఆర్‌ఎస్ పార్టీల నేతలు ఇదొక అపవిత్ర కలయిక అంటూ ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల్లో కలయికలే ఉంటాయి తప్ప అపవిత్ర కలయికలు ఉండవని గుర్తుంచుకోవడం లేదు. తమ వాదనతో ప్రజల సానుభూతి కూడా పొందలేరని గుర్తుంచుకోవాలి. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతి చేసి. ఆయన బతికుండగానే తెలుగుదేశం పార్టీని లాగేసుకున్న ఘనుడు చంద్రబాబు నాయుడు. అలాంటి పార్టీలో పెరిగి పెద్దయిన వ్యక్తి సిఎం కెసిఆర్. అలాంటి పార్టీతో జతకట్టిన ఆపర్టీ బిజెపి. ఇవన్‌ఈన మరచి ఆ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ టిడిపిలది అపవిత్ర పొత్తు అని చెప్పడం ద్వారా తమ వైఫల్యాలను బయటపెట్టుకోవడం తప్ప మరోటి కాదు. తామే వంద సీట్లు గెలుస్తామని చెబుకుంటున్న వారికి ఈ రెండు పార్టీలు కలిస్తే ఎందుకంత ఉలుకన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ వ్యతిరేకత ప్రాతిపదికన ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో చేయి కలపడాన్ని ప్రజలు హర్షిస్తారా అన్న ప్రశ్న ఉదయించడదు. ఎందుకంటే ఎన్టీఆర్ బతికుండ గానే పార్టీ ఆయనది కాకుండా పోయింది. ఆయననే తృణీకరించిన వారికి ఆయన ఆత్మతో ఇక సంబంధం ఎందుకుంటుంది. అందునా రాజకీయాల్లో ఇలాంటివి అస్సలు ఉండవు. అన్నింటికీ మించి తెలంగాణలో కాంగ్రెస్‌తో కలవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అంచనాకు అవకాశాలు ఉన్నాయి. రాజకీయంగా ఏ విషయంలోనైనా ఆచితూచి వ్యవహరించే చంద్రబాబు ఈ విషయంలో తొందరపడ లేదన్నది
గుర్తుంచుకోవాలి. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌పై ఏపీ ప్రజలలో ఇంకా ఆగ్రహంతో ఉన్నారనకుంటే పొరపాటు. కాంగ్రెస్‌కన్నా ఇప్పుడు బిజెపిపైనే ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. నమ్మించి మోసం చేసిన పార్టీగా బిజెపిని భావిస్తున్నారు. తెలంగాణలో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడమెలా అన్నదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచించారు. శతృవును దెబ్బ కొట్టాలంటే కాంగ్రెస్‌తో పొత్తు తప్పదని గుర్తించారు. అది ఎలాంటి ఫలితం ఇస్తుందన్నది ఓటర్లు తేలుస్తారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలవడం వల్ల ఏపీలో చంద్రబాబుకు రాజకీయంగా నష్టం జరుఏగుతందన్న వాదనలో కూడా పసలేదు. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసినంత మాత్రాన సెటిలర్ల ఓట్లు తెలుగుదేశం పార్టీకి గంపగుత్తగా లభిస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో స్వయంగా చంద్రబాబు ప్రచారం చేసినా తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం ఎదురైందన్న వాస్తవాన్ని మరువ కూడదు.అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే కాంగ్రెస్‌తో చేయి కలపడం వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించగలమన్న గ్యారెంటీ కూడా లేదు. క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితుల ప్రకారం మహాకూటమి ఏర్పడినా కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు వెల్లడి స్తున్నాయి. అందువల్ల ఈ రెండు పార్టీల కలయికను పెద్దగా చేసి విమర్శలు చేయడం కూడా తగదు. కాంగ్రెస్‌తో కలవడం వల్ల ఏపీలో రాజకీయ ప్రత్యర్థులకు కొత్త ఆయుధం ఇచ్చినట్టు అవుతుందని కూడా అభిప్రాయ పడుతున్న వారూ ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో జట్టు కట్టి కూడా కేసీఆర్‌ను ఓడించగలమన్న ధీమా కూడా పనికిరాదు. జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీని ఓడించాలన్న చంద్రబాబు ప్రయత్నాల్లో మాత్రమే ఇక్కడడ కాంగ్రెస్‌తో టిడిపి జతకడుతోందని అర్థం చేసుకోవాలి. నిజానికి తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించాలంటే అద్భుతాలు జరగాలి. కాంగ్రెస్ నేతృత్వంలో అలాంటి అద్భుతాలు జరుగుతాయనుకోవడం భ్రమే అవుతుంది. క్షేత్రస్థాయి పరిస్థితులను అన్ని కోణాల నుంచీ అంచనా వేసుకున్న విూదటే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఎన్నికలు జరిగి ఉంటే మహా కూటమి వ్యూహం ఫలించి ఉండేదేమో చెప్పలేం కానీ, ప్రస్తుతానికి మాత్రం అదొక విఫల ప్రయోగంగా మారబోతోంది. ఈ కూటమిలో చేరకుండా సిపిఎం మోకాలడ్డుతోంది. అందుకే తెలంగాణలో ఇప్పుడు ఎన్ని పార్టీలు కలిసినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించలేని పరిస్థితి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం పుంజుకోకపోగా, గత ఎన్నికలతో పోల్చితే మరింత బలహీనపడింది. తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, కమ్యూనిస్టులు కలిసి మహాకూటమిగా పోటీ చేసినా కెసిఆర్ లాంటి బలమైన నాయకుడిని ఢీకొనడం అంత సులువు కాకపోవచ్చు.