ఆరోగ్యపథకాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలి
హైదరాబాద్: యూనివర్సల్ హెల్త్ కవరేజి కోసం ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి నిపుణుల బృందం సూచనలను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు శ్రీనాథ్‌రెడ్డి ఆరోగ్య పరిరక్షణపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రదర్శనను సీఎం తిలకించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ 108, 104సేవలను విస్తృత పరచాలని సీఏం సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ కార్యదర్శి మిన్నీ మధ్యూ, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రత్నకిషోర్, ప్రాథమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చందనాఖన్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.సుబ్రహ్మణ్యం ఇతర అధికారులు పాల్గొన్నారు.