ఆస్టేల్రియా పర్యటన చాలా కీలకం

– ధావన్‌, పంత్‌లు గొప్పగా రాణించారు

– టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ

న్యూఢిల్లీ, నవంబర్‌12(జ‌నంసాక్షి) : ఆస్టేల్రియా పర్యటన భారత్‌కు చాలా కీలకమని టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. ఆదివారం వెస్టడీస్‌తో జరిగిన టీ20 చివరి మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రోహిత్‌ విూడియాతో మాట్లాడుతూ… ‘ధావన్‌ సాధారణంగా వన్డేల్లో బాగా ఆడతాడని, కానీ, ఇటీవల చెప్పుకునేంతగా పరుగులు చేయలేకపోయాడన్నారు. ఆదివారం జరిగిన టీ20లో ఆయన టీమిండియాను గెలిపించడం పట్ల నేను హర్షం వ్యక్తం చేస్తున్నానన్నారు. ఆస్టేల్రియా వంటి కీలక పర్యటన ముందు అద్భుతంగా రాణించాడన్నారు. ఆయన తిరిగి ఫామ్‌లోకి రావాలని వ్యాఖ్యానించాడు.

రిషబ్‌ చాలా బాగా రాణించాడని రోహిత్‌ అన్నారు. నేను, కేఎల్‌ రాహుల్‌ మొదటి ఆరు ఓవర్లలోనే ఔట్‌ అయ్యామని, జట్టుపై ఒత్తిడి కూడా ఉందన్నారు. ధావన్‌, పంత్‌ జట్టును గెలిపించేలా భాగస్వామ్య పరుగులని నమోదు చేశారని రోహిత్‌ కొనియాడారు. ఆఇద్దరు రాణించడం జట్టుకి చాలా ముఖ్యమని, విదేశాల్లో ఆడడం ఎల్లప్పుడూ సవాలుగానే ఉంటుందన్నారు. జట్టుకి మాత్రమే కాకుండా, వ్యక్తిగతంగా ఆటగాళ్లకి కూడా ఓపరీక్షలా ఉంటుందన్నారు. ఆస్టేల్రియా పర్యటన చాలా ప్రత్యేకంగా ఉంటుందన్నారు. ఈ సిరీస్‌లలో గెలిస్తే మాలో విశ్వాసం మరింత పెరుగుతుందన్నారు. ఇటీవల వెస్టిండీస్‌లో జరిగిన సిరీస్‌లో మాఫీల్డింగ్‌ చాలా బాగుందన్నారు. అయితే, బౌలింగ్‌, బ్యాటింగ్‌ల్లో కొన్ని పొరపాట్లు కనపడ్డాయని రోహిత్‌

అన్నాడు. ఇటీవల కొత్త ఆటగాడు కృనాల్‌ పాండ్యా ఆడిన తీరు తనను ఆకట్టుకుందని, ఆయనకు టీమిండియాలో చాలా కాలం ఆడే సత్తా ఉందని రోహిత్‌ ప్రశంసించాడు. మహేంద్ర సింగ్‌ ధోనీ ప్రస్తుతం జట్టుకి ఎంపిక కాకపోవడంపై ఆయన స్పందిస్తూ..’ఆయన జట్టులో ఉంటే అందరు ఆటగాళ్లలో చాలా ఆత్మ విశ్వాసం ఉంటుందన్నారు. ఆయన ఇప్పుడు జట్టులో లేకపోవడం వల్ల ఏదో కోల్పోయినట్లు ఉంటుందని వ్యాఖ్యానించారు. కాగా, భారత్‌-ఆస్టేల్రియా మధ్య తొలి టీ20 నవంబరు 21న ప్రారంభం కానుంది.