ఆహార భద్రత ఆర్డినెన్సుకు ఆమోదించిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈరోజు ఆహార భద్రత బిల్లును ఆమోదించారు. ఆహార భద్రత బిల్లును అర్డినెన్సుగా తీసుకురావడానికి కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆరు వారాల్లోగా…. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభలు బిల్లును అమోదించాల్సి ఉంది. లేనిపక్షంలో బిల్లును తొలగించాల్సి ఉంటుంది. రూ. 1.25లక్షల కోట్లతో యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ పథకాన్ని రూపొందింది. ఆహార భద్రతాబిల్లును అమల్లోకి తేవడం ద్వారా మూడోసారి కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది.