ఆ నాలుగు పార్టీలు..  తెదేపాను టార్గెట్‌ చేశాయి


– వాళ్ల విమర్శలే మనకు దీవెనలవుతాయి
– తుఫాన్‌ బాధితులను పరామర్శించేందుకు కేంద్రం నుంచి ఒక్క బీజీపీ నేతరాలేదు
– కనీస సాయం కూడా అందించడం లేదు
– జగన్‌ ప్రజలను రెచ్చగొడుతుంటే.. పవన్‌ ఒడ్డునుండి గడ్డలేస్తుండు
– జగన్‌ది చిత్తశుద్దిలేని పాదయాత్ర
– అలా మరోనాలుగేళ్లు పాదయాత్ర చేసిన ఫలితం ఉండదు
– ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజాభిమానం మనపైనే ఉంది
– పార్టీలోని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి
– పార్టీ నేతల టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు నాయుడు
అమరావతి, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : బీజేపీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌, జనసేన.. ఆ నాలుగు పార్టీలకు టీడీపీనే టార్గెట్‌ అని, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోబ పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌ కు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌ఛార్జ్‌లు, ప్రధాన కార్యదర్శలు హాజరయ్యారు. ఓటర్ల నమోదు, కౌన్సిల్‌ ఎన్నికలు, బూత్‌ కన్వీనర్ల శిక్షణ, గ్రామ వికాసం పురోగతిపై సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నాలుగు పార్టీలు అసత్య ప్రచారాలతో టీడీపీని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నాయని, ప్రజలు నిజాలు తెలుసుకుంటారని, వాళ్ల విమర్శలే మనకు దీవెనలుగా మారుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. తుఫాన్‌ ప్రభావంతో శ్రీకాకుళం అల్లకల్లోలంగా మారితే.. స్థానికులను పరామర్శించి భరోసాను కల్పించేందుకు కేంద్రం నుంచి ఒక్క బీజేపీ నేత కూడా రాలేదన్నారు. నష్టం కింద మనం అడిగిన తక్షణ సాయాన్ని కూడా చేయలేదని వాపోయారు. అయినా  తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో అనునిత్యం పర్యటిస్తూ స్థానికుల్లో భరోసాను నిలుపుతున్నామని, తక్కువ సమయంలోనే ఎక్కడి సమస్యలను అక్కడే పరిష్కరిస్తున్నామని తెలిపారు. తానుబాధితుల్ని పరామర్శిస్తుంటే.. వైసీపీ ప్రజలను రెచ్చగొట్టి అడ్డంకులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇక పవన్‌కల్యాణ్‌ ఒడ్డున ఉండి గడ్డలు వేస్తున్నాడని ఆరోపించారు. రాజమహేంద్రవరంలో పవన్‌ కవాతును ప్రశంసించిన కేటీఆర్‌.. తిత్లీ తుపాను బాధితులపై కనీసం సానుభూతి కూడా ప్రకటించకపోవటం బాధాకరమన్నారు.జగన్‌ పాదయాత్రకు ప్రజల్లో స్పందన కరువైందన్న చంద్రబాబు, అతని ఫ్యాక్షన్‌ మనస్తత్వామే దీనికి కారణమని వెల్లడించారు. జగన్‌ చిత్తుశుద్ధితో పాదయాత్ర చేయడం లేదని, డ్రామాగా పాదయాత్ర చేస్తున్నాడని విమర్శించారు. జగన్‌ ఇలానే మరో నాలుగేళ్లు నడిచినా అతనికి ఫలితం దక్కదని జోస్యం చెప్పారు. దేనికైనా విజన్‌, ఎగ్జిక్యూషన్‌ ఉంటేనే ఫలితాలొస్తాయని స్పష్టం చేశారు. ప్రజాభిమానమే తెలుగుదేశానికి నైతిక బలంగా అభివర్ణించారు. ఇందుకోసం తానొక్కడినే కష్టపడితో కుదరదని, పార్టీ మొత్తం కష్టపడితే ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి బాగా పెరుగుతుందని సూచించారు. తితలీ బాధితులకు ప్రభుత్వం చేసిన సాయాన్ని ప్రజలు ఎంతో అభిమానిస్తున్నారని గుర్తుచేశారు. ప్రజాభిమానం ప్రభుత్వంపై ఉందన్నారు. అది ఓర్వలేకే ప్రత్యర్థి పార్టీలు అక్కసు వెళ్లగక్కుతున్నాయని తెలిపారు. ప్రజలకు మనలను దూరం చేయాలని విపక్షాలు కుట్రలు
చేస్తుంటే.. ప్రజలు మనస్ఫూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. సంతృప్తి శాతం 57శాతం నుంచి 76శాతంకు పెరిగిందని పేర్కొన్నారు. ‘మళ్లీ విూరే రావాలి’ అని సామాన్యులు, పేదలు నినాదాలు చేస్తున్నారని చంద్రబాబు స్పష్టంచేశారు.

తాజావార్తలు