ఇంగ్లాండ్‌ 400 ఆలౌట్‌

నాyuvraj_bat_england_300లుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ అనుకున్న దానికంటే ఎక్కువ స్కోరే చేసింది ఇంగ్లాండ్‌. ఆ జట్టును 350 లోపు కట్టడి చేయాలన్న భారత్‌ ప్రయత్నం ఫలించలేదు. జోస్‌ బట్లర్‌ (76; 137 బంతుల్లో 6×4, 1×6) పోరాటంతో పర్యటక జట్టు 400 పరుగులు చేయగలిగింది. అశ్విన్‌ (6/112), జడేజా (4/109) ఇంగ్లాండ్‌పై బాగానే ఒత్తిడి తెచ్చినా.. ఆ జట్టు మెరుగైన స్కోరే చేసింది. ఐతే బ్యాటింగ్‌లో భారత్‌ దీటుగానే బదులిచ్చింది. మురళీ విజయ్‌ (70 బ్యాటింగ్‌ 169 బంతుల్లో 6×4, 2×6), చెతేశ్వర్‌ పుజారా (47 బ్యాటింగ్‌; 102 బంతుల్లో 6×4) రాణించడంతో శుక్రవారం ఆట ఆఖరుకు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 146 పరుగులు చేసింది. వీళ్లిద్దరూ అభేద్యమైన రెండో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. ప్రస్తుతానికి మెరుగైన స్థితిలోనే ఉన్నప్పటికీ.. వాంఖడె స్టేడియంలో బంతి బాగా తిరుగుతూ, బౌన్స్‌ అవుతున్న నేపథ్యంలో మూడో రోజు భారత్‌ కొంచెం జాగ్రత్తగా ఆడితేనే ఇంగ్లాండ్‌ స్కోరును అధిగమించగలదు.