ఇంటింటి సర్వేలో ప్రజలకు అంటువ్యాధులు, పారిశుధ్యం పై అవగాహన కల్పించాలి.

సర్పంచ్ ఊరగావలి కృష్ణ.

దోమ న్యూస్ జనం సాక్షి.

అంటు వ్యాధులు, పారి శుధ్యం పైన ప్రజలకు అవగాహన కల్పించాలని  సర్పంచ్ ఊరగావలి కృష్ణ వైద్య సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శి కి సూచించారు. బుధవారం దోమ మండలం దాదాపూర్ గ్రామంలో ఇంటింటి వైద్య సర్వే లో భాగంగా పంచాయతీ కార్యదర్శి రవీందర్ రెడ్డి, ఏఏనేమ్ యాదమ్మలతో కలిసి సర్పంచ్ పలు ఇళ్లలో సర్వే నిర్వహించారు. వర్షాకాలం వల్ల అంటువ్యాధులు ప్రభలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలని ప్రతి ఇంట్లో ఎవరికైన జ్వరాలు ఉంటే వారికి మంచి వైద్యం అందించాలని సర్పంచ్ తెలిపారు. ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకునే విదంగా చూడాలని చెత్తను ట్రాక్టర్ కు ఇవ్వాలని అన్నారు.ప్రతి ఇంటి సర్వే లో అనారోగ్యంకు గురైన వారిని గుర్తిస్తే వారి ఇళ్లకు ప్రతి రోజు వెళ్లి పరిస్థితి గమనించాలని, అలాగే బ్లుస్టర్ డోస్ కూడా వేయించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలని సర్పంచ్ వైద్య సిబ్బందికి సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు రమేష్, శ్రీను, ఆశ వర్కర్లు మాధవి, యాదమ్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area