-ఇంటింట జాతీయ జెండాను ఎగురవేద్ధాం.. జాతీయ ఐక్యతాను చాటుదాం…!
-బీజేపీ పందిల్ల ఎంపీటీసీ బాణాల జయలక్ష్మి…!!!
హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 12 (జనంసాక్షి) హుస్నాబాద్ మండలం పందిళ్ల ఎంపీటీసీ బాణాల జయలక్ష్మి ఆధ్వర్యంలో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హార్ ఘర్ తిరంగ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, జాతీయ జెండాలను పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పందిల్ల ఎంపీటీసీ మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హార్ ఘర్ తిరంగ ప్రతి కార్యకర్త వారి ఇంటిపై జాతీయ జెండాను ఈ నెల 13 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎగరువేసి, జాతీయ భావాన్ని పెంపొందించాలని, జాతీయ ఐక్యతాను చాటాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన అమర వీరులను, స్వాతంత్ర్య సమర యోధుల పోరాటాన్ని స్మరించుకోవాల్సినవసరం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు విద్యాసాగర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నాగిరెడ్డి విజయ్పాల్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మగాని రవీందర్ గౌడ్, కార్యదర్శి జైపాల్, ఉపాధ్యక్షులు పూదరి కిష్టయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, బీజేవైయం మండల అధ్యక్షులు జాపా శ్రావణ్ రెడ్డి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు పూదరి శివ గౌడ్,బూత్ అధ్యక్షులు పెండ్యాల సంపత్ రెడ్డి, నార్లపురం సత్యం, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గోన్నారు.