ఇంటి పన్ను , నీటి పన్ను వసూలు మరియు ట్రేడ్ లైసెన్స్ వసూలు పైన సిబ్బందితో సమీక్ష

– మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి.
సిద్దిపేట 28, జూలై ( జనం సాక్షి )
ఇంటి పన్ను , నీటి పన్ను ప్రతి రోజు  ఉదయాన్నే తమకు సంబంధించిన రెవెన్యూ వార్డులలో తిరుగుతూ పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. ఒక్కో బిల్ కలెక్టర్ కి సంబంధించిన డిమాండ్ వారు వసూలు చేసిన  కలెక్షన్ ఇంకా వసూలు చేయాల్సిన డిమాండ్ పైన ఇట్టి సమీక్ష సమావేశంలో చర్చించారు. నీటి పన్ను వసూలు చేయాలని , ఇంటి వద్ద నల్లా కనెక్షన్ ఉండి ఆన్లైన్ లో లేని వాటిని గుర్తించి ఆన్లైన్ చేయాలన్నారు. ముస్తాబాద్ చౌరస్తా వద్ద గల విద్యుత్ శాఖ వారి పన్ను 90 శాతం వడ్డీ మాఫీ తో 667132 రూపాయలను విద్యుత్ శాఖ వారు చెల్లించటం జరిగింది. ఇట్టి 90 శాతం వడ్డీ మాఫీని పట్టణ ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ట్రేడ్ లైసెన్స్ సైతం వసూలు చేయాలని , ప్రజలకు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలపాలన్నారు. మరియు నూతన గృహ నిర్మాణం కొరకు అనుమతులు పొందినవారు రెసిడెన్షియల్ అనుమతులు పొంది అట్టి గృహ నిర్మాణం కమర్షియల్ గా వాడుతున్న వాటిని గుర్తించాలన్నారు. తమ సంబంధిత ఏరియాలో గల నూతన గృహ నిర్మాణాలకు తప్పనిసరిగా అసెస్మెంట్ చేపించాలన్నారు.  ఈ సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి మేనేజర్,హరితహారం అధికారి సామల ఐలయ్య,శ్రీకాంత్ ఆర్.ఓ,బాలకృష్ణ. యు.డి.ఆర్.ఐ,కిష్టయ్య , బిల్ కలెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.
Attachments area