ఇంత దారుణమా స్మశానం వాటికను వదిలిపెట్టలేదు
బషీరాబాద్ జులై 15,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో జయంతి కాలోనికి సంబందించిన ఎస్సి ల కోసం కేటాయించిన స్మశాన వాటిక భూమి నీ కొంత మంది ఈ మధ్యన కొన్నామని కడ్డీలు పాతిన్నారు. ఈ విషయం తెలుసుకున్న జయంతి కాలోని వాసులు వెంటనే తహశీల్దార్ ఎన్. వెంకట్ స్వామి కి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో కాలోని వసూలు మాట్లాడుతూ వెంటనే బషీరాబాద్ మండలంలో నవాంద్గీ గ్రామ శివారులో ఇటు అర్ అండ్ బీ రోడ్డు అటు సెంట్రల్ రైల్వే ట్రాక్ మధ్యన ఉన్న సర్వే నంబర్ 118 లో గత వంద సంవత్సరాల పైబడి ఇక్కడ తాత పెద్దలు చనిపోతే సమాధులు ఇక్కడే పెట్టాము. ఇప్పుడు ఎవరో వచ్చి ఈ భూమిని కోనము అన్నీ చెపుతున్నారు. ఇపుడు ఎవరైనా చనిపోతే మేము ఎక్కడ సమాధి చేయాలి అంటూ మండిపడ్డారు. ఈ స్థలం యొక్క కడ్డీలను తొలగిస్తున్నాము.వెంటనే ఈ సమస్యా పై తహశీల్దార్ ఎన్. వెంకట్ స్వామి వెంటనే స్పందించి ఈ సమస్య తీర్చాలని కాలనీవాసులు కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో కాలోని వసూలు మలేశం,పకిరప్ప,నర్సిములు,వాండ్ రసి శంకర్,చిన్న,శంకర్,ఎస్. శంకర్,మొగులప్ప,సిద్ధప్ప,రాములు , యువకులు, అశోక్,రాములు,రాజు,తదితరులు పాల్గొన్నారు.
Attachments area




