ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రులు
మహిషాసుర మర్ధనిగా దర్శనమిచ్చిన అమ్మవారు
భారీగా తరలివచ్చిన భక్తులు..అమ్మవారి సేవలో నటి హేమ
విజయవాడ,అక్టోబర్14 (జనం సాక్షి) : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం నాటికి 8వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారు మహిషాసుర మర్దనిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు.
అమ్మవారు అష్టబుజాలతో అవతరించి సింహవాహినిjైు, దుష్టుడైన మహిషాసురుడిని సంహరించి దేవతలు, ఋషులు, మానవుల కష్టాలను తొలగించింది. ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీకనకదుర్గమ్మ నిజ స్వరూపం కూడా ఇదే కావడం విశేషం. కాగా శుక్రవారంతో దసరా వేడుకలు ముగియనున్నందున ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి పర్వతం ఎరుపుమయంగా మారింది. దేవీ నవరాత్రుల సందర్భంగా భవానీలు నవరత్న మాల వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్టాల్ర నుంచి దుర్గమ్మ దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భవానీలు వస్తున్నారు. మూడు రోజుల పాటు భవానిల తాకిడి ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో విజయదశమికి చేసిన ఏర్పాట్లు మరో రెండురోజుల పాటు పొడిగించనున్నారు. ప్రకాశం బ్యారేజీలో వరద ఎక్కువగా ఉన్నందున స్వల్ప మార్పులతో కనకదుర్గ అమ్మవారి తెప్పోత్సవం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై కలెక్టర్ జె.నివాస్ సమక్షంలో దసరా కో ఆర్డినేషన్ సమావేశం జరిగింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నదిలో
విహారం లేకుండా దుర్గా మళ్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెప్పోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం కృష్ణానదిలో దుర్గా మళ్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు యథాతథంగా పూజలు నిర్వహిస్తామన్నారు. పరిమిత సంఖ్యలో అర్చకులతో నదిలో దుర్గమ్మ, స్వామివార్ల ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహిస్తామని కలెక్టర్ జె.నివాస్ వెల్లడిరచారు. ఇదిలావుంటే ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను నటి హేమ గురువారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనానంతరం హేమ విూడియాతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దసరాలో ప్రతీ ఏటా అమ్మవారిని దర్శించుకుంటానని తెలిపారు. కొండంత ధైర్యం ఇవ్వమని అమ్మవారిని కోరుకున్నానని అన్నారు. మా ఎలక్షన్స్‌లో రాత్రి గెలిచాము ఉదయం ఓడిపోయాము..ఏం జరిగిందో ఆ అమ్మవారికే తెలియాలని అని హేమ పేర్కొన్నారు.