ఇంద్రానూయికి ఒబామా నుంచి ఆహ్వానం
వాషింగ్టన్ : అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి పరిష్కారాల గురించి చర్చించేందుకు అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి భారతీయ అమెరికన్, పెప్సీ కంపెనీ సీఈఓ ఇంద్రానూయికి ఆహ్వానం అందింది. అర్థికలోటును తగ్గించడంపై పౌరసమాజం, వ్యాపార, కార్మిక, కాంగ్రెస్ వర్గాల్లో వివిధ నాయకులతో జరుపుతున్న విస్కృతస్థాయి చర్చల్లో భాగంగా ఒబామా ముగ్గురు భారతీయ అమెరికన్లను కూడా ఆహ్వానించారు. వారిలో ఇంద్రానూయి ఒకరు కాగా మిగిలిన ఇద్దరిలో సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ అనే సంస్థ అధ్యక్షుడు నీరా టాండన్, సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఛేంజ్ సంస్థకు చెందిన దీపక్ భార్గవ ఉన్నారు. వీరందరితో ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం, లోటును తగ్గించడానికి ఉత్తమ మార్గాలను కనుగొనడంవంటి అంశాలపై ఒబామా ఈ వారంలో జరిగే సమావేశాలలో చర్చిస్తారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.