ఇటిక్యాల పాఠశాలకు ఆట వస్తువులు బహూకరించిన ఉపాధ్యాయురాలు

జగదేవ్ పూర్, జూలై    జనం సాక్షి: విద్యార్థులు విద్యాభ్యాసం తోపాటు క్రీడలను కూడా అలవర్చుకోవాలని సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండల విద్యాధికారి ఏ ఉదయ భాస్కర్ రెడ్డి  జిల్లా పీఆర్టీయూ   అధ్యక్షుడు  ఏ శశిధర్ శర్మలు సూచించారు.  మండలంలోని ఇటిక్యాల ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహించి బదిలీ అయిన ఉపాధ్యాయురాలు  గాయత్రి శశిధర్ శర్మ  పాఠశాల విద్యార్థులకు ఆటవస్తులను బహూకరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.  క్రీడలు  మానసిక ఉల్లాసంతో పాటు శారీరకంగా దృఢత్వాన్ని పెంపొందించి  జీవితంలో గెలుపు ఓటములు సహజమనే జీవిత సత్యాలను  నేర్పిస్తాయని తెలిపారు. అనంతరం బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు యుగంధర్ నరసింహారావు గాయత్రీ లను శాలువాలు పూలమాలలతో  ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో  పీఆర్టీయూ మండల శాఖ   అధ్యక్ష   ప్రధాన కార్యదర్శులు సిహెచ్ వెంకట్రామిరెడ్డి కుకునూరు శేఖర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్    ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు  మాధవరెడ్డి ఇటిక్యాల సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్  ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి అరవింద సీనియర్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ ,కిషోర్, గాయత్రి, కమ్రుద్దీన్, భవాని, మంజుల, శ్రీనివాస్ రెడ్డి, పి ఎస్ సి ఎస్ డైరెక్టర్ వెంకటేశం SMC చైర్మన్ భాస్కర్  ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.