ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు

రైతు సంక్షేమం లక్ష్యంగా కెసిఆర్‌ పాలన

ఆదిలాబాద్‌,నవంబర్‌21 (జనం సాక్షి)  : రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కృషి చేస్తున్నారని పాడిసమాఖ్య అధ్యక్షుడు లోకభూమారెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లు మద్దతు ధరలు వచ్చేలా తీసుకుంటున్న చర్యల కారణంగా రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. జిన్నింగ్‌ మిల్లులలో సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్న పత్తిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనేనేరుగా పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పత్తిని కొనుగోలు చేయడం ద్వారా రైతులకు రవాణా ఖర్చులు తగ్గుతుండటంతో పాటు రైతులకు లాభం చేకురుతుందన్నారు. రైతులందరికీ రూ. లక్ష రుణం మాఫీ చేసిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని అన్నారు. కాంగ్రెస నాయకులు గతాన్ని మరచి విమర్శలు చేయడం దారుణమన్నారు. గతంలో ఏనాడు రైతులను పట్టించుకోని కాంగ్రెస్‌ నేతలకు రైతుల భయం పట్టుకుందన్నారు. ఇక తమకు పుట్టగతులు లేవనే విమర్శలకు దిగుతున్నారని గురువారం నాడిక్కడ అన్నారు. పాడి సంపదనతో అదనపు ఆదాయాన్ని సాధించవచ్చని, ఆ దిశగా రైతులు దృష్టి సారించాలన్నారు. పండ్లు, కూరగాయలు, పాలు దిగుమతి అవుతున్నందున రైతులు వాటిపై దృష్టి సారించాలన్నారు. రైతులను సంఘటితం చేసేందుకు రైతు సమన్వయ సమతులను ఏర్పాటు చేశామన్నారు. ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టరు ఏర్పాటు చేసి ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమిస్తామన్నారు. రూ.15 లక్షలతో రైతు భవనం నిర్మించి ఆ భవనంలోనే భూసార పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించమన్నారు.

తాజావార్తలు